రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయోత్సవాలు క్షణాల్లోనే విషాదానికి దారితీశాయి. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది అమాయక అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఇది కేవలం ఆటపై ప్రేమగా ప్రారంభమైన ఒక మౌలిక జనం పోరాటం చివరికి ప్రాణాలు బలికొన్న హృదయ విదారక ఘటనగా మారింది.

విధానసౌధ నుంచి స్టేడియానికి: అభిమానుల ఉత్సాహం అంతులేని దుస్థితికి దారితీసింది
బుధవారం ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య RCB జట్టును విధానసౌధలో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆటగాళ్లు విజయోత్సవాల్లో పాల్గొనేందుకు చిన్నస్వామి స్టేడియానికి బయలుదేరారు. అయితే, విధానసౌధ నుంచి వారు బయటకు వస్తున్న సమయంలో వేలాదిగా తరలివచ్చిన అభిమానులు వారిని చుట్టుముట్టారు.
వర్షం మధ్య కోహ్లీపై అభిమానుల తాకిడి
ముఖ్యంగా విరాట్ కోహ్లీని చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఆ సమయంలో పోలీసులు కూడా భారీగా తరలివచ్చిన అభిమానులను నియంత్రించలేకపోయారు. దీనికి తోడు వర్షం కురుస్తుండటంతో ఆటగాళ్లను సురక్షితంగా స్టేడియానికి తరలించడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. అతికష్టం మీద క్రికెటర్లను అక్కడి నుంచి బయటపడేలా చేసి స్టేడియానికి చేర్చారు.
స్టేడియం వద్ద విషాదం – తొక్కిసలాటలో నలుగురు చిన్నారులు సహా 11 మంది మృతి
ఆటగాళ్లు విధానసౌధ నుంచి స్టేడియానికి చేరుకున్న కొద్దిసేపటికే స్టేడియం బయట భారీగా అభిమానులు గుమికూడారు. స్టేడియానికి చేరుకున్న కొద్దిసేపటికే చిన్నస్వామి స్టేడియం వెలుపల అభిమానుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకుంది. విధానసౌధ వద్ద విరాట్ కోహ్లీ అభిమానుల మధ్య నుంచి అతికష్టమ్మీద బయటపడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అభిమానుల తాకిడికి కోహ్లీ దాదాపు చిక్కుకుపోయినట్లు, తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
Read also: Rcb : తొక్కిసలాట ఘటనలో హైకోర్టును ఆశ్రయించిన కర్ణాటక క్రికెట్ సంఘం