हिन्दी | Epaper
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

RCB: ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన ఆర్సీబీ

Anusha
RCB: ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన ఆర్సీబీ

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో ఆర్‌సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో 18 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ తొలి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది.జూన్ 3 రాత్రి ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ పంజాబ్ బ్యాటర్ శశాంక్ సింగ్‌కు చివరి బంతిని బౌలింగ్ చేయగానే స్టేడియం మొత్తం సందడితో నిండిపోయింది. ఈ చారిత్రాత్మక విజయంతో ఆర్సీబీ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది.వాస్తవానికి ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ జట్టు తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL), ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) టైటిళ్లను గెలుచుకున్న రెండో ఫ్రాంచైజీగా అవతరించింది. ఆర్సీబీ మహిళా జట్టు గత సంవత్సరం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో బలమైన ప్రదర్శన ఇచ్చి టైటిల్‌ను గెలుచుకుంది. అప్పుడు ఎల్లిస్ పెర్రీ, స్మృతి మంధాన, రేణుకా సింగ్ వంటి క్రీడాకారణుల అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా ఆర్సీబీ మహిళా జట్టు ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ విజయం మహిళా జట్టుకు మాత్రమే కాదు మొత్తం ఆర్సీబీ ఫ్రాంచైజీకి కూడా పెద్ద విజయంగా మారింది. 

విజయవంతమైన ఫ్రాంచైజీ

ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ముంబై పురుషుల జట్టు ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. కానీ 2023లో ముంబై ఇండియన్స్ మహిళల జట్టు మొదటి సారి డబ్ల్యూపీఎల్ టైటిల్‌‌(WPL title)ను గెలుచుకుంది. ముంబై తర్వాత ఇప్పుడు ఆర్సీబీ కూడా ఈ ఘనతను సాధించింది. భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల జాబితాలో ఆర్సీబీ చేరింది.

RCB: ఐపీఎల్ లో  చరిత్ర సృష్టించిన ఆర్సీబీ
RCB: ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన ఆర్సీబీ

హాఫ్ సెంచరీ

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(35 బంతుల్లో 3 ఫోర్లతో 43) టాప్ స్కోరర్‌గా నిలవగా మయాంక్ అగర్వాల్(24), రజత్ పటీదార్(26), లివింగ్ స్టోన్(25), జితేష్ శర్మ(24) పర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/40), కైల్ జెమీసన్(3/48) మూడేసి వికెట్లు తీయగా అజ్మతుల్లా ఒమర్జాయ్, విజయ్ కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) తలో వికెట్ తీసారు.అనంతరం 20 ఓవర్లలో పంజాబ్ 7 వికెట్లకు 184 పరుగులే చేసి ఓటమిపాలైంది. శశాంక్ సింగ్(29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/38), కృనాల్ పాండ్యా(2/17) రెండేసి వికెట్లు తీయగా జోష్ హజెల్ వుడ్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ తీసారు.

Read Also: Krunal Pandya : ఆర్‌సీబీ తొలి విజయంలో కృనాల్ ఘనత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870