ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా,గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో(10 ఓవర్లు మిగిలుండగానే) పంజాబ్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది.ముందుగా బౌలింగ్‌లో నిప్పులు చెరిగి పంజాబ్ కింగ్స్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేసిన ఆర్‌సీబీ(RCB) అనంతరం ఫిల్ సాల్ట్ విధ్వంసంతో సునాయస విజయాన్నందుకుంది. 9 ఏళ్ల తర్వాతా ఫైనల్ చేరిన ఆర్‌సీబీ 18 ఏళ్ల తమ కలను సాకారం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. మరోవైపు ఊహించని ఆటతీరుతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న పంజాబ్ కింగ్స్‌కు క్వాలిఫయర్-2 రూపంలో మారో అవకాశం ఉంది.ఆర్‌సీబీ ఈ గెలుపుతో 9 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆర్‌సీబీ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి. గతంలో 2009, 2011, 2016లో ఫైనల్ చేరిన ఆర్‌సీబీ తృటిలో టైటిల్ చేజార్చుకుంది. క్వాలిఫయర్-1 మ్యాచ్ అనంతరం మాట్లాడిన రజత్ పటీదార్(Rajat Patidar) ప్రణాళికలకు తగ్గట్లు ఆడి విజయం సాధించామని తెలిపాడు. సుయాశ్ శర్మ, ఫిల్ సాల్ట్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.
లక్ష్యంగా
ఈ మ్యాచ్‌లో స్పష్టమైన బౌలింగ్ ప్రణాళికలతో బరిలోకి దిగాం. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు ఈ పిచ్‌ను అద్భుతంగా ఉపయోగించుకున్నారు. సుయాష్(Suyash Sharama) రాణించిన తీరు అతని లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ అద్భుతం.అతని బౌలింగ్ గురించి నాకు క్లారిటీ ఉంది. అతను స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకోని బౌలింగ్ చేయాలి. అదే అతని బలం. అతని బౌలింగ్‌ను రీడ్ చేయడం బ్యాటర్ల కు కష్టం. నేనెప్పుడూ అతనికి మంచి చిట్కాలు చెప్పాలనుకుంటాను. నేను అతన్ని అస్సలు కన్ఫ్యూజ్ చేయను. ఈ క్రమంలో అతను కొన్ని పరుగులు ఇచ్చినా పర్వాలేదు.

బ్యాటింగ్
మేం చాలా ప్రాక్టీస్ చేశాం. కాబట్టి ఒక రోజు ప్రాక్టీస్ చేయకపోవడం వల్లే వచ్చే నష్టం ఏం లేదు. ఫిల్ సాల్ట్(Phil Salt) చాలా మ్యాచ్‌ల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అదిరిపోయే ఆరంభాలు అందించాడు. అతని బ్యాటింగ్‌కు నేను పెద్ద అభిమానిని.డకౌట్ నుంచి అతని ఆటను చూడటం అద్భుతంగా ఉంటుంది. నేను ఎప్పుడూ ఆర్‌సీబీ అభిమానులకు కృతజ్ఞతలు చెబుతాను. మా హోమ్ గ్రౌండ్ చిన్నస్వామిలో మాత్రమే కాదు మేము ఎక్కడికి వెళ్లినా అది మా సొంత మైదానం అనిపిస్తుంది. మా అభిమానుల్ని మేం ప్రేమిస్తున్నాం. ఇలానే మాకు మద్దతు తెలపండి. ఇంకొకటి గెలవాల్సి ఉంది.ఆ తర్వాత కలిసి వేడుక చేసుకుందాం.’అని రజత్ పటీదార్ అన్నాడు.
Read Also: PBKS vs RCB : పంజాబ్ కింగ్స్‌పై ఆర్‌సీబీ ఘన విజయం