2031 World Cup : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)పై పాకిస్థాన్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు మరోసారి ఒత్తిడి పెంచుతున్నాయి. భారత్‌తో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్ బహిష్కరణ అంశంపై చర్చలు కొనసాగుతున్న వేళ, ఇప్పుడు కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చాయి. 2031 వన్డే ప్రపంచకప్ వరకు ‘హైబ్రిడ్ మోడల్’ను కొనసాగించాలని ఈ రెండు బోర్డులు కోరుతున్నాయి. ఇది భారత్‌కు ఆతిథ్య హక్కుల విషయంలో కొత్త తలనొప్పిగా మారే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఎన్‌డీటీవీ కథనం ప్రకారం, ప్రస్తుతం 2027 వరకు మాత్రమే అమల్లో ఉన్న హైబ్రిడ్ మోడల్‌ను 2031 వరల్డ్‌కప్ వరకు పొడిగించాలని పీసీబీ, బీసీబీ డిమాండ్ చేస్తున్నాయి. 2031 ప్రపంచకప్‌కు భారత్–బంగ్లాదేశ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో, ఈ ప్రతిపాదనకు ఐసీసీ అంగీకరిస్తే పాకిస్థాన్, బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను భారత్‌లో కాకుండా బంగ్లాదేశ్‌లోనే ఆడే వీలుంటుంది.
Read Also: AP: బర్డ్ ఫ్లూ తో 28 వేల కోళ్లు మృతి

ఈ నేపథ్యంలో భారత్‌తో కొలంబోలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌పై పాకిస్థాన్ తీసుకున్న బహిష్కరణ నిర్ణయాన్ని చర్చించేందుకు లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐసీసీ, పీసీబీ, బీసీబీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాకిస్థాన్ ప్రభుత్వ ఆమోదం తర్వాతే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం.
ఇదిలా ఉండగా, హైబ్రిడ్ మోడల్‌తో పాటు పరిహారం పెంపు, టోర్నీ నుంచి వైదొలిగినా పార్టిసిపేషన్ ఫీజు, భవిష్యత్తులో మరో ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులు వంటి డిమాండ్లను కూడా పీసీబీ ముందుంచినట్లు తెలుస్తోంది. దీంతో ఐసీసీకి ఈ వివాదం మరింత క్లిష్టంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: