Jay Shah: టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో చోటుచేసుకున్న ఉత్కంఠభరిత పరిణామాలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఛైర్మన్ జై షా తొలిసారి స్పందించారు. ముంబైలో జరిగిన ‘ఇండియన్ బిజినెస్ లీడర్ అవార్డ్స్’ వేదికగా ఆయన మాట్లాడుతూ.. ఐసీసీ నిబంధనలు అందరికీ సమానమేనని, ఏ ఒక్క జట్టు కూడా బోర్డును శాసించలేదని కుండబద్దలు కొట్టారు. సంస్థ ప్రయోజనాలు, క్రీడా స్ఫూర్తే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Kuldeep Yadav Wedding: ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా
బంగ్లాదేశ్ ఉదంతం.. స్కాట్లాండ్‌కు అవకాశం
భద్రతా కారణాల సాకుతో భారత్‌కు ప్రయాణించేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడం, ఫలితంగా ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్‌ను చేర్చుకోవడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. బంగ్లాకు మద్దతుగా తొలుత భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ హెచ్చరించినా, ఆ తర్వాత వెనక్కి తగ్గి టోర్నీలో పాల్గొంది.

ఇక టోర్నీ విజయవంతం కావడంపై జై షా హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వరల్డ్ కప్ వ్యూయర్‌షిప్ రికార్డులను తిరగరాసిందని ఆయన తెలిపారు. ఒకానొక సమయంలో ఏకంగా 7.2 మిలియన్ల మంది లైవ్ వ్యూయర్స్ టోర్నీని వీక్షించారని, ఇది క్రికెట్ చరిత్రలోనే ఒక మైలురాయి అని కొనియాడారు. కేవలం పెద్ద జట్లే కాకుండా యూఎస్ఏ, నెదర్లాండ్స్, జింబాబ్వే, నేపాల్ వంటి చిన్న జట్లు కూడా దిగ్గజ జట్లకు గట్టి పోటీ ఇచ్చి క్రికెట్ స్థాయిని పెంచాయని ఆయన ప్రశంసించారు.
చివరగా ప్రపంచకప్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్‌లకు జై షా ఒక కీలక సందేశం ఇచ్చారు. శిఖరాగ్రం నుంచి కిందకు పడిపోవడానికి కొన్ని నెలలు చాలని, కానీ అట్టడుగు నుంచి పైకి ఎదగడానికి ఏళ్లు పడుతుందని హెచ్చరించారు. కష్టపడి పని చేస్తూ విజయ పరంపరను కొనసాగించాలని సూచించారు. 2028 ఒలింపిక్స్‌తో పాటు 2030, 2031, 2036 వరకు భారత క్రికెట్ భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: