हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: రాజస్థాన్ రాయల్స్‌ ను వీడనున్న నితీష్ రాణా

Anusha
IPL 2025: రాజస్థాన్ రాయల్స్‌ ను వీడనున్న నితీష్ రాణా

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా, రాజస్థాన్ రాయల్స్‌కు ఈ సీజన్ చాలా దారుణంగా ఉంది. ఆ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు రాజస్థాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ నితీష్ రాణా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. నిజానికి నితీష్(Nitish Rana) రాణా గాయం కారణంగా టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. నితీష్ రాణా స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన బలమైన ఆటగాడిని జట్టులో చేర్చారు.నితీష్ రాణా టోర్నమెంట్ నుంచి తప్పుకున్న తర్వాత రాజస్థాన్ రాయల్స్ 19 ఏళ్ల దక్షిణాఫ్రికా ఎడమచేతి వాటం ఆటగాడు లువాన్-డ్రే ప్రిటోరియస్‌ను జట్టులోకి చేర్చుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఇప్పటికే ఎడమచేతి వాటం బ్యాటర్ యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఉన్నారు. ఇద్దరు లెఫ్టార్మ్ బ్యాటర్లు ఉండగానే,మరో ఎడమచేతి వాటం బ్యాటర్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేర్చుకుంది.

 IPL 2025: రాజస్థాన్ రాయల్స్‌ ను వీడనున్న నితీష్ రాణా
IPL 2025: Nitish Raana

అత్యధిక

లువాన్ ఇప్పటికే దక్షిణాఫ్రికా ప్రీమియర్ టీ20 క్రికెట్ లీగ్ అయిన SA20లో పార్ల్ రాయల్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. SA20 2025లో ప్రిటోరియస్( Pretorius) క్రికెట్ అభిమానులలో చాలా ఖ్యాతిని సంపాందించాడు. తన మొదటి ఎలైట్ ఫ్రాంచైజ్ టోర్నమెంట్ ఆడిన ఈ యువకుడు 166.81 స్ట్రైక్ రేట్‌తో 397 పరుగులు సాధించాడు. ఈ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.ఈ టోర్నమెంట్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్ల గాయాలతో ఇబ్బంది పడుతోంది. కెప్టెన్ సంజు శాంసన్ కూడా గాయం కారణంగా మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఇది కాకుండా రాజస్థాన్ రాయల్స్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మ కూడా గాయం కారణంగా టోర్నమెంట్‌కు దూరంగా ఉన్నాడు.

Read Also :world Test Championship : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870