News Telugu: టీమిండియా వన్డే జట్టు తర్వాతి కెప్టెన్ ఎవరు అన్న చర్చకు ముగింపు పలికారు మాజీ ఆటగాడు, క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా (Akash Chopra). ఇటీవల మీడియాలో వస్తున్నట్లు, శ్రేయస్ అయ్యర్ కొత్త కెప్టెన్ అవుతాడన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు.

శుభ్‌మన్ గిల్ పేరే ఖాయం – చోప్రా
తన యూట్యూబ్ ఛానల్‌లో అభిమానులతో మాట్లాడుతూ చోప్రా, “రోహిత్ శర్మ తర్వాత వన్డే కెప్టెన్సీ శుభ్‌మన్ గిల్‌దే. ఈ విషయంలో నిర్ణయం తీసుకుని అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది” అని స్పష్టం చేశారు. గిల్ ఇప్పటికే టెస్ట్ కెప్టెన్‌గా నియమితులయ్యారని, టీ20ల్లో కూడా ఆసియా కప్ కోసం వైస్ కెప్టెన్‌గా అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు.
“శుభ్‌మన్ గిల్ ఇప్పటికే వన్డే వైస్ కెప్టెన్. టెస్ట్ జట్టుకు కెప్టెన్. టీ20లకు కూడా వైస్ కెప్టెన్. కాబట్టి తర్వాతి కెప్టెన్ ఎవరో అడగాల్సిన అవసరం లేదు. అది గిల్ అనే” అని చోప్రా తేల్చిచెప్పారు.
శ్రేయస్, గిల్ – ఇద్దరూ మంచి నాయకులే
అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) నాయకత్వాన్ని కూడా ప్రశంసించిన చోప్రా, “అయ్యర్ కేకేఆర్‌కు టైటిల్ అందించాడు. గిల్ గుజరాత్ జట్టును ప్లేఆఫ్స్‌కు నడిపించాడు. ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్‌ను డ్రా చేశాడు. ఇద్దరూ అద్భుత నాయకులు. కానీ, గిల్ తన ప్రదర్శనతో జట్టుకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ముందుండి నడిపించే నాయకుడు అతను” అని వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: