భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. గతంలో ఆర్యన్ బంగర్గా గుర్తింపు పొందిన అనయ.. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ మహిళ గా తన కొత్త జీవితాన్ని స్వీకరించింది. అయితే కేవలం వ్యక్తిగత మార్పే కాకుండా, క్రీడా రంగం (Sports field) లోనూ తన స్థానం కోసం పోరాటం చేస్తోంది.ఐసీసీ, బీసీసీఐ ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లకు మద్దతు ఇవ్వాలని కోరారు. ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లను మహిళల క్రికెట్లో ఆడేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. అనయ బంగర్ తాజాగా ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక వీడియోను షేర్ చేస్తూ తాను మహిళల క్రికెట్‌కు అర్హురాలినని వెల్లడించింది. గతంలో ఆర్యన్ బంగర్గా పిలవబడిన అనయ బంగర్ (Anaya Bangar)తాను హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ(హెచ్ఆర్టీ) తీసుకున్న తర్వాత ఒక అథ్లెట్‌గా తాను చేసిన ప్రయాణాన్ని పంచుకోవడంతో పాటు 8 పేజీల అథ్లెట్ టెస్టింగ్ నివేదికను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు.
నా ప్రయాణానికి
ఆ వీడియో సందేశంలో అనయ బంగర్ మాట్లాడుతూ తాను మహిళల క్రికెట్లో పాల్గొనేందుకు అర్హురాలినని అనయ పేర్కొన్నారు. ఒక ఏడాది పాటు హెచ్ఆర్టీ (HRT) పూర్తి చేసుకున్న తర్వాత మాంచెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీతో కలిసి ఈ పరీక్షలు చేయించుకున్నట్లు అనయ వెల్లడించారు. ఈ పరీక్షల్లో భాగంగా తన కండరాల బలం, ఓర్పు, గ్లూకోజ్, ఆక్సిజన్ స్థాయిలను సిస్జెండర్ మహిళా అథ్లెట్ల (female athletes) తో పోల్చి చూశారని, ఆయా పారామీటర్లు సిస్జెండర్ మహిళా అథ్లెట్ల ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని పరీక్షా నివేదికలు తెలిపాయని ఆమె పేర్కొన్నారు.ఆ వీడియోలో అనయ మాట్లాడుతూ “మొట్టమొదటిసారికి ట్రాన్స్ ఉమెన్ అథ్లెట్‌గా మారిన నా ప్రయాణానికి సంబంధించిన శాస్త్రీయ రిపోర్టులను అందరికీ చూపిస్తున్నాను. హార్మోన్ థెరపీ ప్రారంభించిన అనంతరం నా శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ రిపోర్టులకు సంబంధించిన డేటా మొత్తం ఉంది. ఈ రిపోర్టును బీసీసీఐ, ఐసీసీకి పంపిస్తున్నాను.
క్రికెట్ ఆడేందుకు
ఇది కేవలం నిజాలను చెప్పడం గురించే. ఎవరు అంగీకరించినా, లేకపోయానా పరవాలేదు. థాంక్యూ” అంటూ అనయ బంగర్ చెప్పుకొచ్చింది. తన ఇన్‌స్టా పోస్ట్‌కు “సైన్స్ ప్రకారం నేను మహిళల క్రికెట్ ఆడేందుకు అర్హురాలిని. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ప్రపంచం ఈ నిజాన్ని వినడానికి సిద్ధంగా ఉందా?” అంటూ క్యాప్షన్ జోడించారు.ఇదిలా ఉండగా ప్రస్తుత నిబంధనల ప్రకారం ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లు (Transgender cricketers) మహిళల క్రికెట్లో పాల్గొనడానికి అవకాశం లేదు. వారిని క్రికెట్లోకి అనుమతించేది లేదంటూ ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 సమయంలో ఐసీసీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అనయ బంగర్ గతేడాది హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ, లింగ నిర్ధారణ శస్త్రచికిత్స చేయించుకున్నారు.
Read Also: IND vs ENG: 3-1 తేడాతో గెలవడం పక్కా : సచిన్ టెండూల్కర్