
MS Dhoni Viral Video: భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్ సమయంలో ఇది చోటుచేసుకుంది. ఆ సమయంలో ఇంగ్లండ్ జట్టు 254 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే ప్రయత్నంలో అతి దగ్గరగా ఉంది. భారత స్టార్ పేసర్ జస్ప్రత్ బుమ్రా వేసిన ఒక బంతిని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ ఆడిన షాట్ ఆడాడు. అయితే దాన్ని బుమ్రా ఆపాడు. దాంతో స్టాండ్స్‌లో కూర్చున్న సాక్షి ధోనీకి ఆ క్షణంలో బుమ్రా క్యాచ్ పట్టేశాడని అనిపించింది.
Read Also: Axar patel : అద్భుత క్యాచ్‌తో మ్యాచ్ మలుపు, భారత్ కు అందిన విజయం
వీఐపీ బాక్స్‌లో దిగ్గజాల సందడి
అంతే కాదు, వికెట్ పడిందని అనుకున్న సాక్షి వెంటనే ఆనందంతో లేచి సెలబ్రేట్ చేయడం ప్రారంభించింది. అయితే వాస్తవానికి బంతి బుమ్రా చేతుల్లోకి వచ్చే ముందు నేలను తాకింది. అంటే అది క్యాచ్ కాదు. సాక్షి ఇలా వికెట్ పడకముందే సెలబ్రేట్ చేయడం చూసిన ఎంఎస్ ధోనీ “వికెట్ పడలేదు.. కాస్త ఆగు” అన్నట్టుగా చేతితో సూచించాడు.
ధోనీ ఇచ్చిన ఆ సైలెంట్ రియాక్షన్ అక్కడ ఉన్నవారిని నవ్వించింది. కామెంటేటర్లు కూడా ఇది చూసిన నవ్వుతూ రియాక్ట్ అయ్యారు.ఆ సమయంలో దగ్గర్లోనే కూర్చున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ఆయన భార్య రితికాతో పాటు అక్కడ ఉన్న ఇతరులు కూడా ఈ సంఘటన చూసి నవ్వుకున్నారు. ఈ సరదా క్షణం వీడియో రూపంలో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: