భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ మహ్మద్ షమీకి కలకత్తా హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. చాలాకాలంగా తన భార్య హసీన్ జహాన్‌తో కొనసాగుతున్న న్యాయపోరాటం కీలక మలుపు తిరిగింది. కోర్టు షమీకి వ్యతిరేకంగా తీర్పు వెల్లడిస్తూ, అతను తన భార్యకు ప్రతినెలా రూ.4 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది. ఇందులో రూ.1.5 లక్షలు హసీన్ జహాన్ (Hasin Jahan) వ్యక్తిగత ఖర్చుల కోసం, మరో రూ.2.5 లక్షలు షమీ కుమార్తె ఐరా మెయింటెనెన్స్ కోసం చెల్లించాలని పేర్కొంది. జస్టిస్ అజయ్ ముఖర్జీ హసీన్ జహాన్ పిటిషన్‌పై ఈ ఆదేశాలు జారీ చేశారు. మొదట హసీన్ జహాన్ నెలకు రూ.7లక్షలు డిమాండ్ చేయగా కోర్టు దానిని తిరస్కరించింది. ఇప్పుడు కలకత్తా హైకోర్టు షమీ వార్షిక ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. హసీన్ జహాన్, మహ్మద్ షమీ (Mohammed Shami) ల వివాదం చాలా కాలంగా కొనసాగుతోంది. హసీన్ జహాన్ గతంలో షమీ నుంచి నెలకు రూ.7లక్షల భరణం కోరింది.
తన భార్య కోసం నెలకు
ఆ సమయంలో కోర్టు ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. హసీన్ జహాన్ మోడలింగ్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారని కోర్టు పేర్కొంది. హసీన్ జహాన్ ఓటమిని అంగీకరించకుండా ఈ నిర్ణయాన్ని సవాలు చేసింది. మొదట అలీపూర్ కోర్టు (Court of Alipore) షమీని తన భార్య, బిడ్డ కోసం నెలకు రూ.80,000 చెల్లించాలని ఆదేశించింది. తర్వాత జిల్లా జడ్జి ఈ ఆదేశాన్నిసవరించారు. జిల్లా జడ్జి మహ్మద్ షమీని తన భార్య కోసం నెలకు రూ.50,000, బిడ్డ కోసం నెలకు రూ.80,000 చెల్లించాలని ఆదేశించారు.ఈ రూ.1.3 లక్షల భరణం ఆదేశం హసీన్ జహాన్‌కు ఆమోదయోగ్యం కాలేదు. అందుకే ఆమె కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది.

షమీ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని
తన నెలవారీ ఖర్చు సుమారు రూ.6.5 లక్షలు అని ఆమె పేర్కొంది. షమీ వార్షిక ఆదాయం సుమారు రూ.7.5 కోట్లు అని హసీన్ జహాన్ వాదిస్తోంది. డబ్బు ఉన్నప్పటికీ షమీ తన భార్య, బిడ్డకు అవసరమైన డబ్బును ఇవ్వడం లేదని ఆమె పేర్కొంది. కలకత్తా హైకోర్టు (Kolkata High Court) షమీ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని నెలకు రూ.4లక్షల ఆదేశాన్ని జారీ చేసింది. ఈ మొత్తం విషయంలో మహ్మద్ షమీ వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. కోర్టు నిర్ణయంపై మహ్మద్ షమీ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఈ కేసు మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
Read Also: RCB: తొక్కిసలాటకు ఆర్సీబీయే కారణం: క్యాట్