हिन्दी | Epaper

Mohammad Amir: అభిషేక్ శర్మపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Anusha
Mohammad Amir: అభిషేక్ శర్మపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ అమీర్ (Mohammad Amir) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ నేపథ్యంలో ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న అమీర్.. అభిషేక్ శర్మను తక్కువ చేసి మాట్లాడాడు. అభిషేక్ శర్మ హిట్టింగ్‌లో ఎలాంటి నైపుణ్యం లేదని, అదృష్టం కొద్దీ అప్పుడప్పుడు పరుగులు వస్తుంటాయని తెలిపాడు.

Read Also: T20 World Cup 2026: ఆసీస్‌పై జింబాబ్వే విజయం

Mohammad Amir: Former Pakistan cricketer's sensational comments on Abhishek Sharma
Mohammad Amir: Former Pakistan cricketer’s sensational comments on Abhishek Sharma

అతనిది చాలా రిస్క్‌తో కూడిన ఆట

అతను ఆడేది చాలా ప్రమాదకరమైన ఆట అని అభిప్రాయపడ్డాడు.’అభిషేక్ శర్మ ఆటను నేను ఎక్కువగా చూడలేదు. కానీ నేను చూసిన కొద్దిపాటి ఆటను బట్టి నిజాయితీగా చెప్పాలంటే.. అతను కేవలం ఒక స్లాగర్ (బాదుడుగాడు). అతను ప్రతీ బంతిని బలంగా బాదడానికే ప్రయత్నిస్తాడు. అతని రోజు బాగుండి ఆ, ఆట క్లిక్ అయితే పర్వాలేదు. లేదంటే అతను విఫలమయ్యే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. అతను 8 ఇన్నింగ్స్‌ల్లో ఒకసారి మాత్రమే స్కోరు చేస్తాడు.

మిగిలిన సమయాల్లో అతని స్కోర్లు 10, 15, 0, 20 గానే ఉంటున్నాయి.టెక్నికల్‌గా అతను పటిష్టమైన బ్యాటర్ అని నేను అనుకోవడం లేదు. అతను ఒకే చోటు నిలబడి, అన్ని బంతులు తను కోరుకున్న ప్రదేశాల్లోననే పడాలని ఆశిస్తాడు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే, అతను ఫామ్‌లో ఉన్న రోజున భారీ స్కోరు చేస్తాడు. ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసిస్తాడు. కానీ అతనిది చాలా రిస్క్‌తో కూడిన ఆట. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు కూడా అతను ఇలానే భారీ షాట్లు ఆడితే పక్కా బ్యాటర్ అని భావిస్తాను.’అని మొహమ్మద్ అమీర్ (Mohammad Amir) చెప్పుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం

కేటీఆర్ చేతుల మీదుగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం!

కేటీఆర్ చేతుల మీదుగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం!

అహ్మదాబాద్‌లో టికెట్ల బ్లాక్ దందా.. ఇద్దరు అరెస్ట్!

అహ్మదాబాద్‌లో టికెట్ల బ్లాక్ దందా.. ఇద్దరు అరెస్ట్!

టీమిండియానే ఫేవరెట్.. కానీ! ట్రోఫీ గెలుస్తుందని గ్యారెంటీ లేదు

టీమిండియానే ఫేవరెట్.. కానీ! ట్రోఫీ గెలుస్తుందని గ్యారెంటీ లేదు

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

నేడే ఫైనల్.. విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?

నేడే ఫైనల్.. విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?

భారత్-కివీస్ టీ20 ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే

భారత్-కివీస్ టీ20 ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే

వరుణ్‌పై ఆందోళన వద్దు, అతడు వరల్డ్ నంబర్ 1: సూర్య

వరుణ్‌పై ఆందోళన వద్దు, అతడు వరల్డ్ నంబర్ 1: సూర్య

ఫైనల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం ప్రత్యేకమైన అనుభూతి

ఫైనల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం ప్రత్యేకమైన అనుభూతి

ఫైనల్ ముందు షాక్? సూర్య రిటైర్మెంట్ వార్తలు

ఫైనల్ ముందు షాక్? సూర్య రిటైర్మెంట్ వార్తలు

ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్ హోటల్ రేట్లకు రెక్కలు

ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్ హోటల్ రేట్లకు రెక్కలు

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు, భారత్ vs న్యూజిలాండ్

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు, భారత్ vs న్యూజిలాండ్

📢 For Advertisement Booking: 98481 12870