ప్రస్తుతానికి ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న మొయిన్ అలీ, బియర్డ్ బిఫోర్ వికెట్ (Beard Before Wicket) అనే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ జరిగిన సమయంలో తన తల్లిదండ్రులు పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రాంతంలోనే ఉన్నారని చెప్పారు. అది నాకు అత్యంత భయానకమైన పరిస్థితి. ఎందుకంటే బాంబుల దాడులు జరిగిన ప్రదేశం వాళ్లు ఉన్న స్థలానికి కేవలం గంట దూరంలోనే ఉంది. అప్పటివరకు ఇది కేవలం జియోపాలిటిక్స్ అనిపించినా, ఆ రోజు నుంచి నాకు వ్యక్తిగతంగా ఏ విధమైన ప్రభావం ఉంటుందో అర్థమైంది అని అన్నారు.

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసుకుని ఎయిర్ స్ట్రయిక్స్ నిర్వహించింది. ఆ దాడుల్లో వందాలది మంది ఉగ్రవాదులు హతమయ్యారని భారత రక్షణశాఖ ప్రకటించింది. అయితే ఆ దాడులు జరిగే సమయంలో క్రికెటర్ మొయిన్ అలీ పేరెంట్స్ పీఓకేలోనే ఉన్నారట. ఆ విషయాన్ని ఓ పాడ్‌కాస్ట్‌లో మొయిన్ అలీనే నేరుగా తెలిపాడు.
కుటుంబం భద్రతపై ఆందోళన:
ఆపరేషన్ సిందూర్ సమయంలో తన పేరెంట్స్ పీఓకేలోనే ఉన్నారని, దాడులు జరిగిన ప్రదేశం వారికి ఓ గంట దూరంలో మాత్రమే ఉండటంతో భయపడ్డానని చెప్పాడు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసుకుని ఎయిర్ స్ట్రయిక్స్ నిర్వహించింది. ఆ దాడుల్లో వందాలది మంది ఉగ్రవాదులు హతమయ్యారని భారత రక్షణశాఖ ప్రకటించింది. అయితే ఆ దాడులు జరిగే సమయంలో క్రికెటర్ మొయిన్ అలీ పేరెంట్స్ పీఓకేలోనే ఉన్నారట. ఆ విషయాన్ని ఓ పాడ్‌కాస్ట్‌లో మొయిన్ అలీనే నేరుగా తెలిపాడు.
మొయిన్ అలీ – జీవిత ప్రయాణం:
పాకిస్తాన్ సంతతికి చెందిన మొయిన్ అలీ ఇంగ్లండ్‌లో స్థిరపడ్డాడు. మొయిన్ అలీ పూర్వీకులు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని మీర్పూర్ ప్రాంతానికి చెందిన వారు. చిన్నతనంలోనే ఇంగ్లండ్‌కి వలసవెళ్లి ఆ దేశ పౌరసత్వం తీసుకుని ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా మొయిన్ అలీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆల్‌రౌండర్‌గా తన సత్తా చాటాడు. భారత్ – పాక్ ఉద్రిక్తతలతో ఇంగ్లండ్ వెళ్లిన మొయిన్ అలీ ఇండియాకు తిరిగి రాలేదు. అయితే భారత్ – పాక్ ఉద్రిక్తతల సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ మేనేజ్‌మెంట్ తనను బాగా చూసుకున్నారని చెప్పాడు. యుద్ధ పరిస్థితుల్లో కూడా ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాల్లో ఏమి జరుగుతుందో ఈ ఘటన బలంగా చూపించింది.
Read also: Belling Muzarabani: బెల్లింగ్ ముజారబానీ బౌలింగ్ చూసి తీరాల్సిందే