భారత వన్డే క్రికెట్ జట్టులో కెప్టెన్సీ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారీ (Manoj Tiwary) సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత వన్డే జట్టు కెప్టెన్‌గా గిల్‌ను వెంటనే తొలగించి, ఆ బాధ్యతలను తిరిగి అనుభవజ్ఞుడు రోహిత్ శర్మకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశాడు. వన్డే సిరీస్‌లు కోల్పోయిన నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించాడు.
Read Also: Palash Muchhal: సింగర్ పలాశ్ ముచ్చల్ పై చీటింగ్ కేసు?
విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ శర్మ
“ఇది కేవలం ద్వైపాక్షిక సిరీస్ గురించి కాదు, రాబోయే 2027 ప్రపంచకప్ గురించి ఆలోచించాలి. అందుకే ఇప్పటికైనా మార్పులు చేయడానికి సమయం ఉందని నేను సూచిస్తున్నాను. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రోహిత్ కెప్టెన్‌గా ఉండుంటే ఫలితం కచ్చితంగా వేరేలా ఉండేది” అని తివారీ అభిప్రాయపడ్డాడు.”కెప్టెన్సీ విషయంలో గిల్‌తో పోలిస్తే రోహిత్ శర్మ కొంచెం కాదు,

చాలా మెరుగైనవాడు. అందుకే అతను అంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. రోహిత్ కెప్టెన్‌గా ఉంటే ప్రపంచకప్ గెలిచే అవకాశాలు 85 నుంచి 90 శాతం ఉంటాయి. అదే గిల్ అయితే ఆ అవకాశం ఎంత ఉంటుందో అందరూ అంచనా వేయగలరు” అని తివారీ (Manoj Tiwary)ఘాటుగా వ్యాఖ్యానించాడు.
రోహిత్ శర్మను “హిట్‌మ్యాన్” అని ఎందుకు పిలుస్తారు?
భారీ సిక్సర్లు, డబుల్ సెంచరీలు తరచుగా చేయడం వల్ల హిట్‌మ్యాన్ అని పిలుస్తారు.
IPLలో అత్యధిక ట్రోఫీలు గెలిచిన కెప్టెన్ ఎవరు?
రోహిత్ శర్మ (5 టైటిల్స్)
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: