క్రికెట్ మైదానంలో విషాదం నెలకొంది. ఢాకా క్యాపిటల్స్ జట్టు అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జకీ (59) (Mahbub Ali Zaki) హఠాన్మరణం చెందాడు. ఇవాళ సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజ్‍షాహీ వారియర్స్‌తో మ్యాచ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు ఈ దురదృష్టకర ఘటన జరిగింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) మ్యాచ్ సమయంలో ఉన్నట్టుండి కుప్పకూలిన ఆయన 50 ఏళ్ల వయసులో కన్నుమూశాడు.
Read Also: AUS vs ENG: యాషెస్ సిరీస్.. ఇంగ్లండ్‌దే
ఆకస్మిక మరణం
తమ కోచ్, అలీ జకీ (Mahbub Ali Zaki) ని, క్యాపిటల్స్ యాజమాన్యం ఆయనను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దాంతో.. ఢాకా క్యాపిటల్స్ ఆటగాళ్లు, సిబ్బంది సహా యావత్ క్రీడాలోకం షాక్‌కు గురైంది. జకీకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, అతడడి ఆకస్మిక మరణం తమను తీవ్రంగా కలచివేసిందని జట్టు అధికారులు తెలిపారు. జకీ మృతికి సంతాపంగా మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు, అధికారులు ఒక నిమిషం మౌనం పాటించారు.

అనంతరం మ్యాచ్ యథావిధిగా కొనసాగింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. దేశ క్రికెట్‌కు, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ల అభివృద్ధికి జకీ చేసిన సేవలు మరువలేనివని కొనియాడింది. ఒకప్పుడు ఫాస్ట్ బౌలర్‌గా రాణించిన జకీ, కొమిల్లా జిల్లాకు, దేశంలో ప్రముఖ క్లబ్ అయిన అబాహనీ లిమిటెడ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: