ఒకరేమో క్రికెట్ గాడ్, మరొకరు ఫుట్‌బాల్ దిగ్గజం.. క్రీడలు వేరు, దేశాలు వేరైనా, ఒకే స్థాయి గొప్పతనం వారిది. వరల్డ్‌కప్ విజేతలు, నెంబర్ 10 జెర్సీకి ప్రాణం పోసిన ఇద్దరు గోట్‌లు ఒకే వేదికపై కలుసుకోవడం క్రీడాభిమానులకు అదో మరపురాని క్షణం. ది గ్రేట్ సచిన్ టెండూల్కర్ , లియోనెల్ మెస్సీ (Lionel Messi) ని ఒకే ఫ్రేమ్‌లో కలిసి చూడటంతో వాంఖడే స్టేడియం ఆనందోత్సాహాలతో ఉప్పొంగింది.
Read Also: Lionel Messi: నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ
క్షణాల్లో వైరల్
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. మెస్సీతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. “ఈ రోజు నిజంగా 10/10 డే, లియో మెస్సీ” అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది.సచిన్ తన పోస్ట్‌లో ’10/10’ అని పేర్కొనడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రికెట్‌లో సచిన్, ఫుట్‌బాల్‌లో మెస్సీ ఇద్దరూ తమ జట్ల కోసం 10వ నంబర్ జెర్సీని ధరించడం విశేషం.
ఈ భేటీ సందర్భంగా సచిన్ తన 10వ నంబర్ టీమిండియా జెర్సీని మెస్సీ (Lionel Messi) కి బహుమతిగా అందించారు. ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో కనపడటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. క్రికెట్, ఫుట్‌బాల్ మధ్య అభిమానుల్లో ఉండే పోటీ వాతావరణం పక్కకుపోయి, ఇద్దరు గొప్ప ఆటగాళ్ల కలయికను అందరూ ఆస్వాదించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: