భారత స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన వంశిక(Vanshika)ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో వీరి నిశ్చితార్థ వేడుక బుధవారం లక్నోలో అత్యంత వైభవంగా జరిగింది. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కుల్దీప్, వంశిక ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుల్దీప్, వంశికల నిశ్చితార్థ వేడుకకు భారత యువ క్రికెటర్ రింకూ సింగ్(Rinku Singh) తదితరులు హాజరైనట్లు సమాచారం. ఇక వీరి వివాహం త్వరలోనే జరగనున్నట్లు తెలుస్తోంది.

వీరి వివాహం
కుల్‌దీప్ యాదవ్, వంశిక చిన్ననాటి స్నేహితులు. స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో ఇరువురి కుటుంబసభ్యుల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. దీంతో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. త్వరలోనే వీరి వివాహం కూడా జరగనుంది. వంశిక ప్రస్తుతం ఎల్‌ఐసీ (LIC)లో పనిచేస్తున్నట్లు తెలిసింది. వీరి ఎంగేజ్మెంట్(Engagement)కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోవైపు త్వరలో ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు కుల్‌దీప్ ఎంపికైన విషయం తెలిసిందే.
Read Also: Novak Jokovich: ఫ్రెంచ్ ఓపెన్ లో చరిత్ర సృష్టించిన నొవాక్ జకోవిచ్