ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel messi) కోల్‌కతా పర్యటనలో అనుకోని అసహనకర పరిస్థితిని ఎదుర్కొన్నారు. సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మెస్సీ, మైదానంలోకి అడుగుపెట్టగానే రాజకీయ నాయకులు, ప్రముఖులు, కొందరు భద్రతా సిబ్బంది ఒక్కసారిగా వేదికపైకి ఎగబడటంతో గందరగోళం నెలకొంది. సెల్ఫీలు, ఫొటోల కోసం చుట్టుముట్టడంతో పరిస్థితి అదుపు తప్పింది. తొలుత ప్రశాంతంగా అభిమానులతో కరచాలనం చేస్తూ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చిన మెస్సీ, ఆ హడావుడితో అసౌకర్యంగా భావించారు.
Read also: Revanth reddy: రేవంత్ రెడ్డి మనవడు మెస్సీతో ఫుట్‌బాల్..

Messi was visibly annoyed as people swarmed him for selfies
సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే
పరిస్థితి మరింత తీవ్రతరం కావడంతో మెస్సీ సహనం కోల్పోయారు. ఆయనతో పాటు వచ్చిన లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కూడా నిర్వాహకుల అవ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఈ గందరగోళం నేపథ్యంలో మెస్సీ కేవలం 20 నుంచి 25 నిమిషాల్లోనే మైదానాన్ని విడిచిపెట్టారు. తమ అభిమాన ఆటగాడిని సరిగా చూడలేకపోయిన ప్రేక్షకులు నిరాశ చెందగా, సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే ఈ ఘటనకు కారణమని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: