టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ (Virat) కోహ్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒక్కసారిగా కనిపించకుండా పోవడం అభిమానుల్లో తీవ్ర ఆందోళనను కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా 27 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఆయన అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయగానే ‘User Not Found’ అని చూపించడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ట్విట్టర్లో యాక్టివ్గా ఉన్నా ఇన్స్టాలో మాయం కావడంతో ఫ్యాన్స్ కంగారు పడ్డారు.
Read Also: Rohit Sharma: హిట్మ్యాన్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్.. అభిమానుల్లో ఉత్కంఠ

క్లారిటీ
అయితే కొద్దిసేపటి తర్వాత విరాట్ (Virat) అకౌంట్ మళ్లీ యాక్టివేట్ కావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ‘అన్న వచ్చాడోచ్’ అంటూ మీమ్స్ షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా నిన్న రాత్రి నుంచి కోహ్లీ Insta అకౌంట్ కనిపించకపోవడం తెలిసిందే. ‘యూజర్ నాట్ ఫౌండ్’ అని చూపించింది. టెక్నికల్ గ్లిచ్ వలన ఇలా అయిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై ఇప్పటి వరకూ విరాట్/ఇన్స్టా స్పందించలేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: