టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానులకు షాకిచ్చాడు. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే నడిచాడు.కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో యావత్ క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది. కోహ్లీ రిటైర్మెంట్‌పై అనేక ఊహాగానాలు వెలువడినా అతని నిర్ణయాన్ని గౌరవిస్తూ అభిమానులు, మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తు మరింత బాగుండాలని ఆకాంక్షించారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నుంచి నితీష్ కుమార్ రెడ్డి వరకు కోహ్లీతో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ప్రస్తుత భారత జట్టులో ఉన్న ఆటగాళ్లతో పాటు టీమిండియాకు ఆడిన ఆటగాళ్లు, దేశవాళీ క్రికెటర్లు కూడా కోహ్లీ రిటైర్మెంట్‌పై స్పందించారు. కానీ టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) మాత్రం కోహ్లీ రిటైర్మెంట్‌పై స్పందించలేదు. సోషల్ మీడియా వేదికగా ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దాంతో కోహ్లీ ఫ్యాన్స్ శ్రేయస్ అయ్యర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నీకు ఎందుకింత బలుపు?’అని ప్రశ్నిస్తున్నారు.

సామర్థ్యం
కోహ్లీనే కాదు రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై కూడా శ్రేయస్ అయ్యర్ స్పందించలేదు. ఇంత అటిట్యూడ్(Attitude) ఉంటే కెరీర్‌లో సక్సెస్ సాధించలేవని, మధ్యలోనే జట్టుకు దూరమవుతావని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. స్టార్ ఆటగాళ్ల పట్ల గౌరవం లేకుంటే ఎలా? అని మండిపడుతున్నారు. అయితే ఈ విమర్శలను శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెట్టకపోయినంత మాత్రానా వారి పట్ల గౌరవం లేదనడం సరికాదని, పర్సనల్‌గా కాల్ చేసి వారితో మాట్లాడి ఉండొచ్చని బదులిస్తున్నారు.విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యం శ్రేయస్ అయ్యర్‌కు ఉందని కామెంట్ చేస్తున్నారు. భవిష్యత్తులో అయ్యర్ మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా ఎదుగుతాడని, ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో అతని ప్రదర్శనే ఇందుకు నిదర్శనమంటున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వారం వ్యవధిలోనే టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇద్దరూ ఒకేసారి తప్పుకోవడంతో భారత క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
Read Also : Kohli,Rohit: వారి రిటైర్మెంట్ నన్ను ఎంతో బాధకు గురి చేసింది: యోగ్ రాజ్ సింగ్