ఐపీఎల్ 2026 సీజన్ ఆడకుండా బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ అహ్మద్‌పై నిషేధం విధించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వ్యక్తమవుతుంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముస్తాఫిజుర్ (Mustafizur Rahman) ఐపీఎల్ 2026 ఆడే వ్యవహరం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేస్తున్నట్లు కేకేఆర్ శనివారం అధికారికంగా ప్రకటించింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంచైజీ స్పష్టం చేసింది.
Read also: Irfan Pathan: RO-KO భవిష్యత్తుపై ఆల్‌రౌండర్ ఏమన్నారంటే?
మరో ఆటగాడు భర్తీ
ఈ విషయంపై కేకేఆర్ ఒక ప్రకటన విడుదల చేసింది. “ఐపీఎల్ నియంత్రణ సంస్థ అయిన బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్ రెహమాన్ (Mustafizur Rahman)ను జట్టు నుంచి విడుదల చేశాం. నిబంధనల ప్రకారం అతని స్థానంలో మరో ఆటగాడిని భర్తీ చేసుకునేందుకు బీసీసీఐ అనుమతించింది. దీనికి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తాం” అని కేకేఆర్ తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా కూడా ధ్రువీకరించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: