న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) ఇప్పుడు తన రెండో ఇన్నింగ్స్‌ను కోచ్‌గా ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. క్రికెట్‌లో తన ఆటతీరు, ధైర్యం, నైజం వల్ల ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ జెంటిల్‌మన్ క్రికెటర్.. ఇప్పుడు తన అనుభవాన్ని యువ క్రికెటర్లకు పంచేందుకు ముందుకొచ్చాడు.
Virat Kohli: ఆస్ట్రేలియాతో సిరీస్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కోహ్లీ పోస్ట్
“దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి” అనే సామెతను అనుసరిస్తూ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కాకముందే తన భవిష్యత్తు కెరీర్‌కు పునాది వేస్తున్నాడు కేన్ విలియమ్సన్ (Kane Williamson).ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తరఫున ఎన్నో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి చిరస్మరణీయ విజయాలు అందించిన కేన్ మామ.. గత సీజన్‌లో అన్‌సోల్డ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అత్యంత స్థిరమైన కెప్టెన్లలో ఒకరైన విలియమ్సన్ నాయకత్వంలో జట్టు ఎన్నో అద్భుత విజయాలను సాధించింది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ గెలవడం నుంచి 2019 వరల్డ్‌కప్ ఫైనల్ వరకు న్యూజిలాండ్ జట్టు (New Zealand team) ప్రదర్శనలో అతని పాత్ర అపారంగా ఉంది.ఈ నేపథ్యంలో తన అనుభవాన్ని కోచింగ్ ఫీల్డ్‌లో ఉపయోగించాలనే ఆలోచనతో ముందడుగు వేస్తున్నాడు.
కోచ్‌గా కొత్త రోల్ పోషించేందుకు సిద్దమయ్యాడు
కామెంటేటర్‌గా అవతారమెత్తిన కేన్ మామ.. అప్‌కమింగ్ సీజన్ కోసం కోచ్‌గా కొత్త రోల్ పోషించేందుకు సిద్దమయ్యాడు. ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్(ఎల్‌ఎస్‌జీ) జట్టుకు స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా పనిచేయనున్నాడు.
ఈ విషయాన్ని లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా (Sanjeev Goenka) సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.’సూపర్ జెయింట్స్ కుటుంబంలో భాగంగా ఉన్న కేన్ విలియమ్సన్‌కు లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ టీమ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా స్వాగతం పలకడం సంతోషంగా ఉంది.
ఆటగాళ్లను ఉత్తేజపరిచే సామర్థ్యం జట్టుకు ఎంతో విలువ
అతని నాయకత్వం, వ్యూహాత్మక అంతర్దృష్టి, ఆటపై లోతైన అవగాహన, ఆటగాళ్లను ఉత్తేజపరిచే సామర్థ్యం జట్టుకు ఎంతో విలువ తీసుకురానుంది.’అని సంజీవ్ గోయెంకా పేర్కొన్నాడు.గత సీజన్‌లో లక్నో జట్టు మెంటార్, బౌలింగ్ కోచ్‌గా బాధ్యతల నిర్వర్తించిన జహీర్ ఖాన్ తప్పుకోవడంతో అతని స్థానాన్ని కేన్ విలియమ్సన్‌తో భర్తీ చేసినట్లు తెలుస్తోంది.
బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ బౌలింగ్ కోచ్ నియామకంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. లక్నో సూజర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా జస్టిన్ లాంగర్ ఉన్న విషయం తెలిసిందే. కేన్ విలియమ్సన్ మెంటార్‌గా జట్టుకు సేవలందించనున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన కేన్ విలియమ్సన్
34 ఏళ్ల కేన్ విలియమ్సన్ ఐపీఎల్‌లో 79 మ్యాచ్‌లు ఆడి 2,128 పరుగులు చేశాడు. 2015 నుంచి 2022 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన కేన్ విలియమ్సన్.. కెప్టెన్‌గా కూడా సేవలందించాడు. ఐపీఎల్ 2018లో ఒంటి చేత్తో జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. 17 మ్యాచ్‌ల్లో 735 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.
ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడిన కేన్ మామ.. ఒకే ఒక్క మ్యాచ్ ఆడి గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లోనూ ఆ జట్టులోనే కొనసాగిన అతను రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో అన్‌సోల్డ్‌గా నిలవడంతో అతని కెరీర్‌కు తెరపడింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: