క్రికెట్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా(Australia) జట్టు ఓటమి పాలైన సందర్భాల్లో, ప్రత్యర్థి జట్టుపై అక్కసు వెళ్లగక్కడం, వారి విజయాన్ని తక్కువ చేయడం ఆ దేశ మీడియాకు ఆనవాయితీ. అయితే, తొలిసారి అక్కడి మీడియా భిన్నంగా స్పందించింది. భారత్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో, భారత ఆల్ రౌండర్ జెమీమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues) అద్భుత సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమి పాలైనప్పటికీ, ఆస్ట్రేలియా మీడియా తమ ఆనవాయితీకి విరుద్ధంగా జెమీమాపై ప్రశంసల జల్లు కురిపించింది.
Read Also: Holding areas: రైల్వే స్టేషన్లలో హోల్డింగ్ ఏరియాలు ప్రారంభం

ఆసీస్ మీడియాలో పతాక శీర్షికలు
ఆస్ట్రేలియా మీడియా జెమీమా ప్రదర్శనను అభినందిస్తూ పతాక శీర్షికల్లో కథనాలు ప్రచురించింది. ముఖ్యంగా తమ జట్టు కెప్టెన్ ఎలీసా హీలీపై(Captain Elissa Healy) విమర్శలు గుప్పించింది. జెమీమా ఇచ్చిన క్యాచ్‌ను చేజార్చడం వల్లే తమ జట్టు ఓడిపోయిందని అందులో పేర్కొన్నారు.
- ఏబీసీ న్యూస్: జెమీమా ప్రదర్శనను అభినందిస్తూ ‘స్టన్నింగ్ ఇన్నింగ్స్. అద్భుతమైన లక్ష్య ఛేదన’ అంటూ కామెంట్ చేసింది. ‘గుడ్ మార్నింగ్ ఆస్ట్రేలియా. భారత్ అద్భుత ప్రదర్శనతో వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కథ ముగిసింది’ అని పోస్టు పెట్టింది.
- ఫాక్స్ క్రికెట్: ‘ఆస్ట్రేలియా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడానికి ప్రధాన కారణం క్యాచ్‌లు డ్రాప్ చేయడమే. జెమీమా జీవితకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడింది’ అని కథనం ప్రచురించింది.
ఆస్ట్రేలియా మీడియా ఎవరిపై ప్రశంసలు కురిపించింది?
భారత ఆల్ రౌండర్ జెమీమా రోడ్రిగ్స్‌పై ప్రశంసలు కురిపించింది.
ఆస్ట్రేలియా మీడియా తమ ఓటమికి గల ప్రధాన కారణంగా దేనిని పేర్కొంది?
కెప్టెన్ ఎలీసా హీలీ, ఇతర ఆటగాళ్లు జెమీమా ఇచ్చిన క్యాచ్‌లను చేజార్చడమే ప్రధాన కారణంగా పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: