ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా(3/12) మూడు వికెట్లతో ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు 3 వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో బుమ్రాకు ఇది 25వ మూడు వికెట్ల ఘనత. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో బుమ్రా, చాహల్ మాత్రమే 20 సార్లకు పైగా మూడు వికెట్లు పడగొట్టారు. చాహల్ 22 సార్లు మూడు వికెట్లు తీసాడు.ఈ జాబితాలో బుమ్రా(25), చాహల్(22), తర్వాత లసిత్ మలింగా(19), రవీంద్ర జడేజా(17), అమిత్ మిశ్రా(17), సునీల్ నరైన్(17), హర్షల్ పటేల్(17) ఉన్నారు. ఈ సీజన్ ఆరంభంలోనే బుమ్రా ముంబై తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతను లసిత్ మలింగా రికార్డ్‌ను అధిగమించాడు. బుమ్రా ఇప్పటి వరకు 181 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్(IPL)లోనే అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో పేసర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో బుమ్రా 9 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు.
హాఫ్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. నమన్ ధీర్(8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)బౌలర్లలో ముఖేష్ కుమార్(2/48) రెండు వికెట్లు తీయగా దుష్మంత్ చమీరా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు. చివరి 2 ఓవర్లలో ముంబై 48 పరుగులు చేయడం గమనార్హం. 19వ ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ 27 పరుగులిచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచాడు.

బ్యాటింగ్
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు కుప్పకూలింది. సమీర్ రిజ్వీ(35 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 39), విప్రజ్ నిగమ్(11 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 20) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో మిచెల్ సాంట్నర్(3/11), జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)(3/12) మూడేసి వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించారు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మ తలో వికెట్ తీసారు.