భారత క్రికెట్ పరిపాలనలో కీలక పాత్ర పోషించిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ క్రికెట్ నిర్వాహకుడు ఇంద్రజిత్ సింగ్ బింద్రా (IS Bindra) (84) కన్నుమూశారు.1993 నుంచి 1996 వరకు బింద్రా బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేశారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 1978 నుంచి 2014 వరకు ఉన్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2015లో PCA స్టేడియం పేరును IS బింద్రా స్టేడియంగా మార్చారు.ఆయన 1975లో అధికారిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.
Read Also: Team India: రికార్డు సృష్టించిన భారత్
ఐసీసీ ప్రధాన సలహాదారుగా కూడా
1987లో వన్డే ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాడు. 1975, 1979, 1983 ఎడిషన్‌ల తర్వాత ప్రపంచ ఈవెంట్‌ను ఇంగ్లాండ్ బయట నిర్వహించడం ఇదే తొలిసారి.అంతేకాకుండా, గతంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రధాన సలహాదారుగా కూడా ఆయన (IS Bindra) కీలక బాధ్యతలు నిర్వహించారు.అలాగే క్రికెట్ ప్రసార రంగంలో దూరదర్శన్‌కు ఉన్న గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా 1994లో సుప్రీంకోర్టును ఆశ్రయించి చారిత్రాత్మక పోరాటం చేశారు.
ఈ కేసులో వచ్చిన అనుకూల తీర్పు ఫలితంగా ఈఎస్‌పీఎన్, టీడబ్ల్యూఐ వంటి అంతర్జాతీయ ప్రసార సంస్థలు భారత మార్కెట్‌లోకి ప్రవేశించాయి. క్రికెట్ సౌత్ ఆఫ్రికా సీఈఓగా హరూన్ లోర్గాట్ నియామకంలోనూ బింద్రా కీలక పాత్ర పోషించారు. క్రికెట్ పరిపాలన నుంచి ఆయన 2014లో పదవీ విరమణ పొందారు.ఐఎస్ బింద్రా మృతికి ఐసీసీ ఛైర్మన్ జై షా సంతాపం తెలిపారు. “బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా మృతికి ప్రగాఢ సంతాపం. ఆయన వారసత్వం భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలి. ఓం శాంతి” అని ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. బీసీసీఐ కూడా సోషల్ మీడియా ద్వారా ఆయనకు నివాళులర్పించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: