IPL 2026: మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఈ సీజన్ కోసం అత్యంత వినూత్నమైన జెర్సీని సిద్ధం చేసింది. ‘లైన్స్ ఆఫ్ లెగసీ’ (Lines of Legacy) అనే థీమ్‌తో రూపొందించిన ఈ జెర్సీలో కేవలం రంగులు మాత్రమే కాదు, జట్టు యొక్క 18 ఏళ్ల అద్భుత ప్రస్థానం దాగి ఉంది. కేకేఆర్ జట్టును ఈ స్థాయికి చేర్చిన చారిత్రక ఘట్టాలను జెర్సీపై ప్రత్యేకమైన గీతల రూపంలో పొందుపరిచారు.
Read Also: IPL 2026: గాయం కారణంగా టోర్నీకి హర్షిత్ రాణా దూరం
మెకల్లమ్ విధ్వంసం నుండి రింకూ సింగ్ మ్యాజిక్ వరకు..
2008లో బ్రెండన్ మెకల్లమ్ ఆడిన 158 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ నుంచి, రింకూ సింగ్ చివరి ఓవర్లో కొట్టిన ఐదు సిక్సర్ల వరకు.. ఇలాంటి ఎన్నో ఐకానిక్ క్షణాలను గీతల రూపంలో జెర్సీపై పొందుపరిచారు. ఈ గీతలన్నీ కలిసి కేకేఆర్ (KKR) అక్షరాలను ఆవిష్కరించేలా వినూత్నంగా డిజైన్ చేశారు. “ఈ జ్ఞాపకాలను జెర్సీలో భాగం చేయడం ద్వారా అభిమానులు జట్టు కథలో ఒక భాగాన్ని ధరించే అవకాశం కల్పిస్తున్నాం” అని కేకేఆర్ ఒక ప్రకటనలో పేర్కొంది.
బీసీసీఐ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం కేకేఆర్ తన తొలి మ్యాచ్‌ను ఈ నెల 29న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఏప్రిల్ 2న ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తొలి హోం మ్యాచ్‌లో తలపడుతుంది. ఇక, ఈసారి వేలంలో కామెరాన్ గ్రీన్, మతీశ పతిరణ, రోవ్‌మన్ పావెల్ వంటి కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసి కేకేఆర్ మరింత పటిష్ఠంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: