IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక యువ పేసర్ హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా ఈ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ నెల 28న టోర్నీ ప్రారంభం కానున్న తరుణంలో, హర్షిత్ అందుబాటులో లేకపోవడం కేకేఆర్ బౌలింగ్ ప్రణాళికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
Read Also: T20 WC 2026: సౌతాఫ్రికా టీంపై మైఖేల్ వాన్ ఫైర్
వార్మప్ మ్యాచ్‌లో తగిలిన గాయం
గత ఫిబ్రవరిలో జరిగిన టీ20 ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ సందర్భంగా హర్షిత్ రాణా మోకాలికి గాయమైంది. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉంటున్న అతను, ఐపీఎల్ నాటికి కోలుకోవడం అసాధ్యమని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తన కథనంలో వెల్లడించింది.
హర్షిత్ రాణా లేకపోవడం జట్టు బౌలింగ్ విభాగంలో ఒక లోటుగా మిగిలిపోనుంది. ఇదిలా ఉంటే.. హర్షిత్ రాణా దూరం కావడంపై వార్తలు రావడానికి కొన్ని గంటల ముందే కేకేఆర్ యాజమాన్యం తమ బౌలింగ్ దళాన్ని బలోపేతం చేసుకుంది. జింబాబ్వే పేస్ సంచలనం బ్లెస్సింగ్ ముజరబానీని జట్టులోకి తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: