మార్చి నెలలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ కోసం (IPL 2026) గూగుల్‌తో బోర్డు ఒక బ్లాక్‌బస్టర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, గూగుల్ జెమిని రాబోయే మూడు ఐపీఎల్ సీజన్ల పాటు లీగ్‌కు ఏఐ స్పాన్సర్‌గా ఉండనుంది. ఈ ఒప్పందం విలువ రూ. 270 కోట్లు, అంటే ఏడాదికి రూ. 90 కోట్లు. టీ20 ప్రపంచకప్ మార్చి 8న ముగిసిన తర్వాత ఐపీఎల్ హంగామా మొదలవుతుంది.
Read Also: IND vs NZ: ఇవాళ భారత్-న్యూజిలాండ్ తొలి టీ 20

టెక్ దిగ్గజాల మధ్య కూడా పోటీ
ఐపీఎల్ గ్లోబల్ బ్రాండ్ వాల్యూ ఎంత వేగంగా పెరుగుతుందో ఈ డీల్ స్పష్టం చేస్తోంది. క్రికెట్ విశ్లేషణలు, డేటా మేనేజ్‌మెంట్‌లో ఏఐ పాత్ర పెరుగుతున్న తరుణంలో ఈ భాగస్వామ్యం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.కేవలం ఐపీఎల్ మాత్రమే కాదు, మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026) లోనూ ఏఐ సందడి కనిపిస్తోంది.
గూగుల్‌కు ప్రధాన ప్రత్యర్థి అయిన ‘ఓపెన్ ఏఐ’కి చెందిన ChatGPT ఇప్పటికే డబ్ల్యూపీఎల్ ప్రస్తుత సీజన్‌కు స్పాన్సర్‌గా ఉంది. ఇప్పుడు గూగుల్ జెమిని ఐపీఎల్‌లోకి ప్రవేశించడంతో, క్రికెట్ మైదానంలో టెక్ దిగ్గజాల మధ్య కూడా పోటీ మొదలైంది. క్రికెట్ అభిమానులకు మరింత చేరువ కావడమే లక్ష్యంగా ఈ కంపెనీలు భారీగా వెచ్చిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: