हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: IPL 2026: ట్రేడ్ ప్లేయర్ల జాబితాను విడుదల చేసిన BCCI

Anusha
Latest News: IPL 2026: ట్రేడ్ ప్లేయర్ల జాబితాను విడుదల చేసిన BCCI

ఐపీఎల్ 2026 (IPL 2026) మినీ వేలం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఫ్రాంచైజీల మధ్య ప్లేయర్ ట్రేడింగ్ హీట్‌ పీక్స్‌కు చేరింది. దీనిపై అభిమానుల్లో నెలకొన్న ఆసక్తికి ముగింపు పలుస్తూ బీసీసీఐ అధికారికంగా ప్లేయర్ ట్రేడింగ్ లిస్టును ప్రకటించింది. ప్రతి సారి లాగానే ఈసారీ కూడా జట్లు భారీ మార్పులు చేయడం గమనార్హం.అందరూ ఊహించినట్లుగానే సంజూ శాంసన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌ (Chennai Super Kings) లోకి వెళ్లగా..

Read Also: IPL Retention: నేడే IPL 2026 Retention List విడుదల

ఆ జట్టుకు చెందిన రవీంద్ర జడేజా, సామ్ కరణ్ రాజస్థాన్ రాయల్స్‌ (Rajasthan Royals) జట్టులోకి వచ్చారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ షమీని లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) తీసుకోగా.. కేకేఆర్‌కు చెందిన మయాంక్ మార్కండేను ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకుంది.అనూహ్యంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ తీసుకోగా..

రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన నితీష్ రాణాను ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ట్రేడ్ చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ఆల్‌రౌండర్ డోనోవన్ ఫెర్రీరాను రాజస్థాన్ రాయల్స్‌ తీసుకుంది. ఈ క్రాష్ ట్రేడ్ డీల్స్‌లో కొందరి ధరలు తగ్గగా మరికొందరు ధరలు పెరిగాయి. ఒక్కో ఆటగాడికి సంబంధించిన ట్రేడ్ డీల్ వివరాలను తెలుసుకుందాం.

Ravindra Jadeja

వెటరన్ ఆల్‌రౌండర్ అయిన రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సీఎస్‌కే తరఫున 12 సీజన్లు ఆడాడు. ఎంతో అనుభవం కలిగిన జడేజా ఇప్పటికే 250 ప్లస్ ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. గత సీజన్‌లో రూ. 18 కోట్ల భారీ ధరకు సీఎస్‌కే రిటైన్ చేసుకోగా.. రాజస్థాన్ రాయల్స్‌ రూ.14 కోట్ల క్యాష్ డీల్‌‌తో తమ జట్టులోకి ట్రేడ్ చేసుకుంది. జడేజా ధర రూ.4 కోట్ల తగ్గింది. అయితే అతనికి కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది.

Sanju Samson

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అయిన సంజూ శాంసన్‌ (Sanju Samson) ను తన పాత ధర రూ.18 కోట్లకే సీఎస్‌కే ట్రేడ్ చేసుకుంది. ఈ లీగ్‌లో అత్యంత అనుభవం కలిగిన వికెట్ కీపర్ అయిన సంజూ.. ఇప్పటి వరకు 177 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 2013లో అరంగేట్రం చేసిన సంజూ రెండు సీజన్లు(2016, 2017)ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. మిగతా 11 సీజన్లు రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు సీఎస్‌కే ఆడబోతున్నాడు.

Sam Curran

సీఎస్‌కేకు చెందిన సామ్ కరన్‌ (Sam Curran) ను రాజస్థాన్ రాయల్స్ తన పాత ధర రూ.2.4 కోట్లకే ట్రేడ్ చేసుకుంది. 27 ఏళ్ల సామ్ కరణ్ ఇప్పటివరకు 64 మ్యాచ్‌లు ఆడాడు. అతనికి రాజస్థాన్ రాయల్స్ మూడో ఫ్రాంచైజీ. 2019, 2023, 2024 సీజన్లలో కేకేఆర్‌కు ఆడాడు.

Mohammed Shami.., Mayank Markande

సన్‌రైజర్స్‌కు చెందిన మహమ్మద్ షమీ (Mohammed Shami) ని రూ.10 కోట్ల పాత ధరకే లక్నో ట్రేడ్ చేసుకుంది. ఇప్పటి వరకు 119 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన షమీ.. సన్‌రైజర్స్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌కు ఆడాడు.లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను అతని రూ.30 లక్షల ధరకే ముంబై ట్రేడ్ చేసుకుంది.

ముంబైతోనే కెరీర్ ప్రారంభించిన మార్కండే 2018, 2019, 2022 సీజన్లు ఆడాడు. 2021‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన మార్కండే 2023, 2024లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. గత సీజన్‌లో అతన్ని కేకేఆర్ తీసుకుంది. ఇప్పటి వరకు 37 మ్యాచ్‌లు ఆడి 37 వికెట్లు పడగొట్టాడు.

Arjun Tendulkar, Nitish Rana..

బౌలింగ్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్‌ (Arjun Tendulkar) ను అతని ధర రూ.30 లక్షలకే లక్నో ట్రేడ్ చేసుకుంది. ముంబై తరఫునే ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన టెండూల్కర్.. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

లెఫ్టార్మ్ బ్యాటర్ నితీష్ రాణా (Nitish Rana) ను ఢిల్లీ క్యాపిటల్స్ అతని రూ. 4.2 కోట్ల ధరకే ట్రేడ్ చేసుకుంది. 100కు పైగా ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన రాణా.. కేకేఆర్‌కు సారథ్యం కూడా వహించాడు.

Donovan Ferreira

ఆల్‌రౌండర్ డోనవన్ ఫెర్రీరా (Donovan Ferreira) ను కోటీ రూపాయలకు రాజస్థాన్ రాయల్స్‌ ట్రేడ్ చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అతని ధర రూ.75 లక్షలే కాగా.. మరో రూ.25 వేలు పెంచి మరి రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది.

ఇప్పటికే శార్దూల్ ఠాకూర్, షెర్ఫెన్ రూథర్ ఫోర్డ్‌ను ట్రేడ్ చేసుకున్నట్లు ముంబై ఇండియన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870