हिन्दी | Epaper

India vs Pakistan: వర్షం కారణంగా భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే?

Anusha
India vs Pakistan: వర్షం కారణంగా భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే?

క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్–పాక్ హై వోల్టేజ్ (India vs Pakistan) మ్యాచ్‌పై వర్షం నీడ కమ్ముకుంది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు కొలంబో వేదికగా జరగాల్సిన భారత్ – పాకిస్థాన్ మ్యాచ్‌కు వాతావరణం ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్, వర్షం కారణంగా రద్దయ్యే ప్రమాదం ఉందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయితే పరిస్థితి ఏంటనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Read Also: Virat Kohli: అఫ్గాన్ ఆటగాళ్లకు బ్యాట్లు గిఫ్టుగా పంపిన కోహ్లీ

ఇరు జట్లకు చెరో పాయింట్

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనల ప్రకారం టీ20 మ్యాచ్‌లో ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 5 ఓవర్ల చొప్పున బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రతికూల వాతావరణం కారణంగా కనీసం 5 ఓవర్ల ఆట కూడా సాధ్యపడకపోతే, మ్యాచ్‌ను ‘ఫలితం తేలలేదు’ (No Result)గా ప్రకటిస్తారు. ఈ టోర్నీలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే సౌకర్యం లేదు.

India vs Pakistan: What if the India-Pakistan match is canceled due to rain?
India vs Pakistan: What if the India-Pakistan match is canceled due to rain?

దీంతో మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు.ప్రస్తుతం గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్ జట్లు చెరో 4 పాయింట్లతో పటిష్ట స్థితిలో ఉన్నాయి. ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దయి చెరో పాయింట్ లభిస్తే, ఇరు జట్ల పాయింట్ల సంఖ్య 5కు చేరుకుంటుంది. దీంతో మిగతా జట్లకు అవకాశం లేకుండానే భారత్, పాకిస్థాన్ రెండూ సూపర్-8 దశకు అర్హత సాధిస్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొలంబోలో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆస్ట్రేలియా ఆలౌట్

ఆస్ట్రేలియా ఆలౌట్

టీమిండియాలోని ప్రతి ప్లేయర్‌తో ప్రమాదమే

టీమిండియాలోని ప్రతి ప్లేయర్‌తో ప్రమాదమే

ఈనెల 25 నుంచి ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌

ఈనెల 25 నుంచి ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌

టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్

టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ వ్యూయర్‌షిప్ రికార్డ్

భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ వ్యూయర్‌షిప్ రికార్డ్

బుమ్రాకు దక్కని గుర్తింపు? నెట్టింట ఆసక్తికర చర్చ!

బుమ్రాకు దక్కని గుర్తింపు? నెట్టింట ఆసక్తికర చర్చ!

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

📢 For Advertisement Booking: 98481 12870