India vs New Zealand : సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక మార్పు చేశాడు. రైట్ ఆర్మ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ **అర్ష్‌దీప్ సింగ్**కు జట్టులో అవకాశం ఇచ్చారు.
టాస్ అనంతరం గిల్ మాట్లాడుతూ, “గత మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ ఒత్తిడిలో పడ్డాం. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. డ్యూ ప్రభావం ఎక్కువగా ఉండదని భావించి చేజ్ చేయడం మాకు అనుకూలంగా ఉంటుందని నిర్ణయించాం” అన్నారు. మధ్య ఓవర్లలో లెంగ్త్ మార్చుతూ బౌలింగ్ చేయడం కీలకమని కూడా తెలిపారు.
Read Also: HYD: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం సక్సెస్ మీట్
న్యూజిలాండ్ కెప్టెన్ మైకేల్ బ్రేస్‌వెల్ మాట్లాడుతూ, (India vs New Zealand) తమ జట్టు మార్పులేమీ లేకుండా బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. “ఇది డిసైడర్ మ్యాచ్. భారత్‌లో తొలి వన్డే సిరీస్ గెలవడానికి మాకు ఇది గొప్ప అవకాశం” అని వ్యాఖ్యానించారు.
బ్లాక్ సాయిల్‌తో ఉన్న ఈ పిచ్ వేగ బౌలర్లకు ప్రారంభంలో కొంత సహాయం అందించినా, తర్వాత బ్యాటర్లకు అనుకూలంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉండటంతో ఈ మ్యాచ్‌పై భారీ ఉత్కంఠ నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: