భారత జట్టు వెస్టిండీస్ (West Indies) తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ మూడవ రోజునే వెస్టిండీస్ జట్టు చిత్తు అయింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్‌లో కానీ, బౌలింగ్‌లో కానీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.
IND vs WI: నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత క్యాచ్ తో ఫిదా అయినా నెటిజన్లు
భారత్-వెస్టిండీస్ (IND vs WI) తొలి టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌ను కేవలం రెండున్నర రోజుల్లోనే ముగించి, ఇన్నింగ్స్, 140 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించడం ఎంతో ప్రత్యేకం.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బౌలింగ్ చేసిన భారత్, అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.
భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా (Team India), పరుగుల వరద పారించింది. కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా అద్భుత సెంచరీలతో కదం తొక్కగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో రాణించాడు.

వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో
దీంతో భారత్ 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లోనే 286 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది.రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ బ్యాటర్ల (West Indies batters) కథ మళ్లీ మొదటికే వచ్చింది. భారత బౌలర్ల పదునైన బంతులకు సమాధానం చెప్పలేక చేతులెత్తేశారు. వరుసగా వికెట్లు కోల్పోయి కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
దీంతో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది.విండీస్ ను రెండో ఇన్నింగ్స్ లో చుట్టేయడంలో స్పిన్నర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja), పేసర్ మహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించారు. సిరాజ్ 31 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, జడేజా 54 పరుగులకు 4 వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించాడు.
7 వికెట్లు పడగొట్టిన సిరాజ్
ఈ మ్యాచ్‌లో మొత్తంగా 7 వికెట్లు పడగొట్టిన సిరాజ్, తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు.ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో, చివరి టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 10 నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: