అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న భారత్-వెస్టిండీస్ తొలి టెస్టు మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) తన అద్భుతమైన ఫీల్డింగ్ ప్రతిభతో క్రికెట్ ప్రేమికులను మంత్రముగ్దులను చేసాడు..అతని ఫీల్డింగ్ విన్యాసానికి విండీస్ ఓపెనర్ త్యాగనరైన్ చందర్‌పాల్(8) నిరాశగా పెవిలియన్ చేరాడు.
Henry Thornton: ఆసుపత్రిలో చేరిన క్రికెటర్ హెన్రీ థోర్న్‌టన్..కారణమిదే?
సిరాజ్ (Siraj) బౌలింగ్‌లో చందర్ పాల్ కొట్టిన బంతిని స్క్వేర్ లెగ్‌లో పక్షిలా గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. మరో ఓపెనర్ కాంప్‌బెల్‌ను జడేజా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 24 పరుగులకే వెస్టిండీస్ 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో అలిక్ అథనాజే(3 బ్యాటింగ్), బ్రాండన్ కింగ్(1 బ్యాటింగ్) ఉన్నారు.
మరో 8 వికెట్లు తీస్తే ఈ మ్యాచ్‌లో టీమిండియా (Team India) ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించే అవకాశం ఉంది. తొలి ఇన్నింగ్స్ తరహాలో భారత బౌలర్లు చెలరేగితే ఈ రోజే ఫలితం రానుంది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది.
జస్టిన్ గ్రీవ్స్(48 బంతుల్లో 4 ఫోర్లతో 32), షైహోప్(36 బంతుల్లో 3 ఫోర్లతో 26), రోస్టన్ ఛేజ్(43 బంతుల్లో 4 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మూడు వికెట్లు పడగొట్టాడు.
కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్‌కు ఒక వికెట్ దక్కింది.భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 128 ఓవర్లలో 448/5 పరుగులకు డిక్లెర్ చేసింది. కేఎల్ రాహుల్(197 బంతుల్లో 12 ఫోర్లతో 100), ధ్రువ్ జురెల్(210 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 125, రవీంద్ర జడేజా(176 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 104 నాటౌట్) సెంచరీలతో సత్తా చాటగా..
కెప్టెన్ శుభ్‌మన్ గిల్(100 బంతుల్లో 5 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్(2/90) రెండు వికెట్లు తీయగా.. జైడన్ సీల్స్, వారికన్, పిర్ తలో వికెట్ తీసారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: