ఇండియన్ క్రికెట్ అభిమానులకు బిగ్ షాక్.. (IND vs USA) మ్యాచ్ మొదలైన క్షణాల నుంచే ఉత్కంఠ నెలకొన్న వేళ, భారత్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. భారత టీ20 క్రికెట్‌లో సంచలనంగా మారిన అభిషేక్ శర్మ, తన డెబ్యూ వరల్డ్ కప్ మ్యాచ్‌లోనే తీవ్రంగా నిరాశపరిచాడు. వాంఖడే వంటి బ్యాటింగ్ పిచ్‌పైఅభిషేక్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తే, అతను డకౌట్ అవ్వడం ఎవరూ ఊహించని పరిణామం. అలీ ఖాన్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడిన అభిషేక్, సంజయ్ కృష్ణమూర్తికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.అంతకుముందు సౌరభ్ నెట్రావాల్కర్ వేసిన తొలి ఓవర్‌లో భారత్ 7 పరుగులు సాధించింది. తొలి నాలుగు బంతులు డాట్‌లుగా వెళ్లగా, ఐదో బంతిని ఇషాన్ కిషన్ సిక్స్‌గా మలిచాడు. భారత్ స్కోర్ 8/1గా ఉంది.
Read Also: T20 World Cup: నెదర్లాండ్స్‌పై పాకిస్తాన్ విజయం

ఇషాన్ కిషన్ వైపు మొగ్గు
ఒకవైపు బ్యాటింగ్‌లో వికెట్ కోల్పోగా, మరోవైపు బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం భారత్‌కు పెద్ద లోటు. వైరల్ ఫీవర్ కారణంగా బుమ్రా తప్పుకోవడంతో మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌ల మీద భారం పెరిగింది. అమెరికా జట్టు గతంలో పాకిస్థాన్‌ను ఓడించిన అనుభవం ఉండటంతో, భారత్ ఇప్పుడు మిడిల్ ఆర్డర్‌పైనే పూర్తిగా ఆధారపడాల్సి ఉంది.సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు ఏ మేరకు రాణిస్తారనే దానిపైనే భారత గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఆడతాడని అంతా భావించారు కానీ, టీమ్ మేనేజ్మెంట్ మాత్రం ఇషాన్ కిషన్ వైపు మొగ్గు చూపింది. ఇషాన్ మొదటి ఓవర్‌లోనే సిక్సర్ బాది తన ఫామ్‌ను చాటుకున్నాడు. కానీ ఓపెనర్ అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అవ్వడం వల్ల ఇషాన్, తిలక్ వర్మల మీద ఇన్నింగ్స్ నిర్మించాల్సిన బాధ్యత ఉంది..
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: