ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ (IND vs PAK) మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది.కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా బౌలింగ్ ఎంచుకున్నాడు.క్రీజులో ఉన్న ఇషాన్ కిషన్ (54*) మెరుపు అర్ధశతకంతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది.
Read Also: 1st T20I: ఆసీస్ పై భారత్ ఘన విజయం
తిలక్ వర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు
బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు (IND vs PAK) ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ చివరి బంతికే ఓపెనర్ అభిషేక్ శర్మ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా శిబిరంలో నిశ్శబ్దం నెలకొంది. అయితే, ఇషాన్ కిషన్ దాటిగా ఆడుతూ ఉత్సాహం కలిగించాడు. వన్ డౌన్ గా క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన కిషన్, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లోనే 50 పరుగులు చేసి అద్భుత ఫామ్‌ను ప్రదర్శించాడు.పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 52 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. తాజా సమాచారం అందేసరికి, భారత్ 8 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్ (72* ;9 ఫోర్లు, 3 సిక్సర్లు), తిలక్ వర్మ (10*) ఉన్నారు.

టీమిండియా ప్లేయింగ్ 11
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
పాకిస్తాన్ ప్లేయింగ్ 11
షాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), బాబర్ ఆజామ్, మొహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఫాహీమ్ అష్రఫ్, ఉస్మాన్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: