ఈ నెల 11 నుంచి భారత్, న్యూజిలాండ్ (IND vs NZ) జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌పై క్రికెట్ అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా భారత జట్టులో కీలక మార్పులు, న్యూజిలాండ్ జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశం లభించడం ఈ సిరీస్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఇరు జట్లు సిరీస్‌కు సిద్ధంగా ఉండటంతో తొలి వన్డే (IND vs NZ) కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read also: Kranti Gaud : క్రాంతి గౌడ్ తండ్రికి తిరిగి పోలీస్ ఉద్యోగం | 13 ఏళ్ల తర్వాత న్యాయం

భారత బ్యాటింగ్ పటిష్టం
ఈ సిరీస్‌లో భారత జట్టుకు ప్రధాన బలంగా శ్రేయస్ అయ్యర్ పునరాగమనం నిలుస్తోంది. గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌లో అతడికి వైస్ కెప్టెన్ బాధ్యతలు కూడా అప్పగించారు.శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లతో భారత బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. మైఖేల్ బ్రేస్‌వెల్ సారథ్యంలో న్యూజిలాండ్ జట్టులో భారత మూలాలున్న ఆదిత్య అశోక్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. ఇరు జట్ల తుది జట్లు కూడా ప్రకటించబడ్డాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: