భారత్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో(IND vs NZ Oneday) న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ డారిల్ మిచెల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 106 బంతుల్లో శతకం పూర్తి చేసిన మిచెల్, భారత్‌తో జరిగిన గత వన్డేలోనూ సెంచరీ బాది తన నిలకడను నిరూపించాడు. వరుసగా రెండో మ్యాచ్‌లో వంద పరుగులు సాధించి కివీస్ ఇన్నింగ్స్‌కు కీలక బలంగా మారాడు.
Read Also: India vs New Zealand : ODI టాస్ భారత్‌దే, సిరీస్ ఎవరిది?

ఫిలిప్స్‌తో కీలక భాగస్వామ్యం
డారిల్ మిచెల్‌కు గ్లెన్ ఫిలిప్స్ చక్కటి సహకారం(IND vs NZ Oneday) అందిస్తున్నాడు. ఇద్దరూ కలిసి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ ఇన్నింగ్స్‌ను స్థిరంగా ముందుకు తీసుకెళ్తున్నారు. 36 ఓవర్ల పూర్తయ్యే సరికి న్యూజిలాండ్ స్కోరు 201/3గా ఉంది. ఫిలిప్స్ ప్రస్తుతం 64 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు.
న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా
మిచెల్–ఫిలిప్స్ జంట క్రీజులో ఉండటంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ సాధించే అవకాశాలు పెరిగాయి. చివరి ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టే అవకాశం ఉండటంతో భారత బౌలింగ్ యూనిట్‌కు కఠిన పరీక్ష ఎదురవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: