IND vs ENG: మార్చి 5వ తేదీన ముంబైలోని చారిత్రాత్మక వాంఖెడే స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న హై-వోల్టేజ్ పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా మేనేజ్‌మెంట్‌కు మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఒక వ్యూహాత్మక సూచన చేశారు. ఇంగ్లాండ్‌ను దెబ్బకొట్టాలంటే భారత్ తన ప్రధాన అస్త్రాన్ని ఆరంభంలోనే ప్రయోగించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also:IND vs ENG Semi Finals: ఈసారి కప్పు ఎవరిది?

గవాస్కర్ విశ్లేషణ ప్రకారం.. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టాలంటే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను మొదటి ఓవర్ నుంచే అటాకింగ్‌లోకి తీసుకురావాలి. పవర్‌ప్లేలో బుమ్రా కనీసం రెండు ఓవర్లు బౌలింగ్ చేయడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్ మరియు హ్యారీ బ్రూక్ వంటి విద్వంసకర బ్యాటర్లను ఇన్నింగ్స్ ఆరంభంలోనే అవుట్ చేసే అవకాశం ఉంటుందని గవాస్కర్ వివరించారు.
ఒకవేళ బుమ్రా తన పదునైన బంతులతో ఇంగ్లాండ్ ఓపెనర్లను త్వరగా పెవిలియన్‌కు పంపగలిగితే, ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని గవాస్కర్ హెచ్చరించారు. వాంఖెడే వంటి బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఇంగ్లీష్ బ్యాటర్లు కుదురుకుంటే కట్టడి చేయడం కష్టమని, అందుకే బుమ్రా వేగమే టీమిండియాకు శ్రీరామరక్ష అని ఆయన స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: