ICC T20: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాళ్లు సత్తా చాటారు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో టీమ్ ఇండియా ప్లేయర్లు టాప్-2 స్థానాలను కైవసం చేసుకుని తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) అద్భుత ప్రదర్శనతో ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మరోవైపు, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా మెరుగైన ప్రదర్శనతో రెండో స్థానానికి చేరుకోవడం విశేషం. దీంతో టాప్-2 స్థానాల్లో భారతీయులే నిలిచారు
Read Also: T20 World Cup 2026 final: అర్షదీప్ సింగ్‌కు ఐసీసీ జరిమానా

భారత మిడిలార్డర్ బ్యాటర్లు కూడా టాప్-10లో తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు. యువ సంచలనం తిలక్ వర్మ 7వ స్థానంలో నిలవగా, టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. కేరళ స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 22వ ర్యాంకుకు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2వ స్థానానికి పడిపోగా.. బుమ్రా 6వ స్థానంలో ఉన్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: