మన లైఫ్ లో చాలా మందికి మ్యాజిక్, సాంగ్స్ వినే అలవాటు ఉంటుంది. సందర్భం, మూడ్ బట్టి తమకు నచ్చిన పాటలను వింటుంటారు. దీని వల్ల మనసు తేలిక అవ్వడంతో పాటు ఒత్తిడి తగ్గి శరీరం, మెదడులో కాస్త చురుకుదనం కూడా వస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతిఒక్కరికీ ఇదే జరుగుతుంది.ఎప్పుడూ ఫుల్ ఎనర్జీతో కనిపించే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బోర్ కొట్టినప్పుడు ఎక్కువగా పాటలు వింటూ చిల్ అవుతూ ఉంటాడు. ప్రాక్టీస్ లేని సమయంలో హెడ్ ఫోన్స్, బ్లూటూత్‌లో సాంగ్స్ వింటుంటాడు. అయితే,కోహ్లీకి ఇష్టమైన సాంగ్స్ అంటే దాదాపు అందరూ బాలీవుడ్ పాటలే అనుకుంటారు. కానీ,కోహ్లీకి దక్షిణాది పాటలంటే ఇష్టమని తెలిసింది. ప్రస్తుతం తాను లూప్‌లో రిపీటెడ్‌గా వింటున్న ఓ తమిళ్ సాంగ్ తన ఫేవరెట్ అంటూ లైవ్‌లో పాట ప్లే చేసి మరీ చూపించాడు.శింబు హీరోగా నటించిన పాథా థాలా సినిమాలోని ఓ పాట కోహ్లీ ఫేవరెట్ సాంగ్ కావడం విశేషం. ఇటీవల ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో అతనే నేరుగా ఈ విషయం చెప్పాడు. ప్రస్తుతానికి తన ఫేవరెట్ సాంగ్ ఏంటి అని అడగ్గానే మొబైల్ తీసి మరీ పాట ప్లే చేసి వినిపించాడు. ఈ మూవీలోని ‘నీ సింగం ధాన్’ అనే పాట ప్రస్తుతం తన మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దాంతో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
బయోపిక్
హీరో శింబు ఆ పోస్టును రీ షేర్ చేశారు. కోహ్లీని ఉద్దేశించి “నువ్వు నిజంగా సింహానివి” అనే క్యాప్షన్‌తో శింబు చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై కోహ్లీ అభిమానులు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీది ప్రత్యేక స్థానం. సచిన్, ధోనీ తర్వాత ఆ స్థాయి గొప్ప ఆటగాడిగా, ప్రేక్షకాభిమానం ఉన్న క్రికెటర్ గా నిలిచాడు. అయితే క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ స్థాయికి ఎదిగిన క్రికెటర్ల బయోపిక్ రావడం సహజమే. ఇప్పటికే సచిన్ డాక్యుమెంటరీ, ధోనీ గురించి సినిమా వచ్చి ప్రేక్షకుల్ని అలరించాయి. కోహ్లీ బయోపిక్ కూడా ఆన్ ది వే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు విరాట్ కోహ్లీ బయోపిక్ కూడా సిద్ధం అవుతున్నట్లు కొత్త ప్రచారం మొదలైంది. ఎప్పట్నుంచో విరాట్ కోహ్లీ బయోపిక్ గురించి బాగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఈ స్టార్ క్రికెటర్ పాత్రలో శింబు నటించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ హీరో అచ్చం కోహ్లీలానే గడ్డం పెంచడంతో ఆ వార్తలకు ఊతం ఇచ్చినట్లైంది. కాగా, విరాట్ బయోపిక్‌లో నటించాలని ఉందంటూ ఇప్పటికే బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ తన మనసులోని మాటను బయటపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 18వ సీజన్ లో కోహ్లీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. వరుస హాఫ్ సెంచరీలతో రన్ మెషీన్ సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచులాడి 443 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ఐదో స్థానంలో ఉన్నాడు.
Read Also: Shubman Gill: అంపైర్‌పై శుభమన్ గిల్ సీరియస్ ఎందుకంటే?