Hardik Pandya: భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చుట్టూ కొత్త వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.. టీ20 ప్రపంచకప్ విజయోత్సవ వేడుకల సమయంలో జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఈ మేరకు పుణెలోని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఓ న్యాయవాది ఫిర్యాదు చేయడంతో ఈ విషయం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: Virat Kohli: ఐపీఎల్ 2026 కోసం ప్రాక్టీస్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ
అడ్వకేట్ వాజిద్ ఖాన్ ఆరోపణలు
న్యాయవాది వాజిద్ ఖాన్ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ఇటీవల న్యూజిలాండ్‌పై టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత అహ్మదాబాద్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో పాండ్యా ప్రవర్తన అభ్యంతరకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. హార్దిక్ పాండ్యాపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. ఇటీవల న్యూజిలాండ్‌పై టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం అహ్మదాబాద్‌లోని స్టేడియంలో టీమిండియా సంబరాలు చేసుకుంది. ఈ వేడుకల్లో హార్దిక్ పాండ్యా త్రివర్ణ పతాకాన్ని తన ఒంటికి చుట్టుకుని, మైదానంలో అసభ్యంగా ప్రవర్తించారని అడ్వకేట్ వాజిద్ ఖాన్ తన ఫిర్యాదులో ఆరోపించారు. “హార్దిక్ చర్య జెండా గౌరవానికి భంగం కలిగించేలా ఉంది. ఇది చట్ట ప్రకారం నేరం. జాతీయ పతాకాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి విధి” అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: