
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. సౌతాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన ఆఖరి టీ20లో తన సిక్సర్ కారణంగా గాయపడిన కెమెరామెన్‌కు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) క్షమాపణలు చెప్పడంతో పాటు హగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు హార్దిక్ పాండ్యాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Read Also: Cricket Tournament: విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో రోహిత్, కోహ్లీతో భారత స్టార్ ఆటగాళ్లు సత్తా చాటేరు
అసలేం జరిగిదంటే?
ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కేవలం 25 బంతుల్లో 63 పరుగులతో చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఐదు భారీ సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో అతను కొట్టిన ఓ సిక్సర్, బౌండరీ లైన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న కెమెరామెన్ భుజానికి బలంగా తాకింది. దీంతో అతడి భుజంపై గాయమైంది. వెంటనే స్పందించిన టీమిండియా ఫిజియో, అతనికి ప్రథమ చికిత్స అందించారు.
భారత ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే హార్దిక్ పాండ్యా నేరుగా ఆ కెమెరామ్యాన్ వద్దకు పరుగున వెళ్లాడు. అతని గాయాన్ని పరిశీలించి, ఐస్ ప్యాక్ పెట్టడంలో సహాయం చేశాడు. అనుకోకుండా జరిగిన పొరపాటుకు క్షమాపణగా అతడిని ఆలింగనం చేసుకుని తన పెద్ద మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, హార్దిక్ క్రీడా స్ఫూర్తిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: