ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా, శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై 20 పరుగుల తేడాతో గుజరాత్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.తొలుత రోహిత్‌శర్మ(50 బంతుల్లో 81, 9ఫోర్లు, 4సిక్స్‌లు) అర్ధసెంచరీతో కదంతొక్కగా, బెయిర్‌స్టో(47), సూర్యకుమార్(33), తిలక్‌శర్మ(25) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 228/5 స్కోరు చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ(2/53), సాయికిషోర్(2/42) రెండేసి వికెట్లు తీశారు.సాయి సుదర్శన్(49 బంతుల్లో 80, 10ఫోర్లు, సిక్స్) ఒంటరిపోరాటం చేయగా, సుందర్(48) ఆకట్టుకున్నాడు. బౌల్ట్ (2/56) రెండు వికెట్లు తీయగా, బుమ్రా, గ్లీసన్, సాంట్నర్, అశ్వని ఒక్కో వికెట్ తీశారు.
కట్టుదిట్టం
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులే చేసి ఓటమిపాలైంది. సాయి సుదర్శన్(49 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 80), వాషింగ్టన్ సుందర్(24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48) పోరాడినా ఫలితం లేకపోయింది. కీలక సమయంలో జస్‌ప్రీత్ బుమ్రా(1/27) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఓటమిని శాసించాడు.ఆఖరి ఓవర్‌లో గుజరాత్ టైటాన్స్ విజయానికి 24 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో సరైన బ్యాటర్లు లేకపోవడం ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. అయితే ఈ 24 పరుగుల్లో 22 రన్స్‌ను హార్దిక్ పాండ్యా తమ ఆఖరి ఓవర్‌లో సాధించడం గమనార్హం.గెరాల్డ్ కోయిట్జీ వేసిన ఆఖరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా మూడు భారీ సిక్స్‌లతో ఈ పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్‌ను కోయిట్జీ కట్టుదిట్టంగా వేసి 12 పరుగులకే పరిమితం చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

వ్యక్తిగత స్కోర్
బుమ్రా వల్ల ముంబై ఇండియన్స్(Mumbai Indians) గెలిచినా గెరాల్డ్ కోయిట్జీ చెత్త ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపాలైంది. పేలవ బౌలింగే కాకుండా 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను కూడా కోయిట్జీ వదిలేసాడు. ఈ అవకాశం అందుకున్న రోహిత్ శర్మ ఏకంగా 81 పరుగులు చేశాడు. కోయిట్జీ ఈ క్యాచ్ పట్టినా ఆఖరి ఓవర్‌ను కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా గుజరాత్ టైటాన్స్ సునాయసంగా విజయం సాధించేది.