కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (IND vs SA) తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దూకుడుగా ఆడుతున్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ వికెట్ కోల్పోయిన కొద్దిసేపటికే, కెప్టెన్ శుభమన్ గిల్ (Shubhaman Gill) బ్యాటింగ్ చేస్తుండగా మెడ నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్ అయ్యి పెవిలియన్‌కు వెళ్లారు. దీంతో భారత్ బ్యాటింగ్‌పై ఒత్తిడి పెరిగింది.
Read Also: IPL 2026: ట్రేడ్ ప్లేయర్ల జాబితాను విడుదల చేసిన BCCI

మెడ నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్
అయితే శుభ్‌మన్ గిల్‌కు నిద్రలో మెడ పట్టేసినట్లు తెలుస్తుంది.! అయినా జట్టు కోసం అతను బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ తన వల్ల కాకపోవడంతో రిటైర్డ్ హర్ట్‌గా బరిలోకి దిగాడు. మెడ నొప్పి కాస్త తగ్గిన తర్వాత శుభ్‌మన్ గిల్ (Shubham Gill) మళ్లీ బ్యాటింగ్‌కు దిగే ఛాన్స్ ఉంది. శుభ్‌మన్ గిల్ వెనుదిరగడంతో రిషభ్ పంత్ (Rishabh Pant) బ్యాటింగ్‌కు వచ్చాడు.
రెండో రోజు భోజన విరామానికి భారత్ 45 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా (11), ధ్రువ్ జురెల్ (05) ఉన్నారు. అంతకుముందు ఓపెనర్ కేఎల్ రాహుల్ (39) అర్ధశతకానికి 11 పరుగుల దూరంలో ఔట్ కాగా, మూడో స్థానంలో వచ్చిన వాషింగ్టన్ సుందర్ 29 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అలాగే రిషభ్ పంత్ 27 రన్స్ చేసి ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో తొలిరోజు భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 159 పరుగులకే కుప్పకూలింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: