న్యూజిలాండ్‌తో తొలి టీ20 ప్రారంభానికి ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, బుధవారం కలిసాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అతను సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. ప్రధానిమంత్రి తర్వాత భారతదేశంలో అత్యంత కష్టమైన ఉద్యోగం గంభీర్‌దేనని ఆయన కొనియాడారు.
Read Also: Abhishek Sharma: రిస్క్ తీసుకోను టైమింగ్‌పైనే ఆధారపడతా
నా సొంత జట్టు సభ్యులతో పోటీపడటం
ఈ ట్వీట్ పైనే తాజాగా గంభీర్ (Gautam Gambhir) స్పందించాడు. “డాక్టర్ శశి థరూర్, మీకు చాలా ధన్యవాదాలు.ఈ దుమారం సద్దుమణిగాక, ఒక కోచ్‌కు ఉండే ‘అపరిమిత అధికారం’ వెనుక ఉన్న నిజానిజాలు, స్పష్టమవుతాయి. అప్పటివరకు, అత్యుత్తమమైన నా సొంత జట్టు సభ్యులతో పోటీపడటం నాకు వినోదంగా ఉంది” అని గంభీర్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమి తర్వాత హెడ్ కోచ్‌గా గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలపై, అతడి వైఖరిపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. శుక్రవారం రాయ్‌పూర్ వేదికగా రెండో టీ20 జరగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: