టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానులకు షాకిచ్చాడు. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే నడిచాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సోమవారం భావోద్వేగభరితమైన పోస్ట్‌తో తన నిర్ణయాన్ని వెల్లడించాడు. కొద్దిరోజుల క్రితమే రోహిత్ శర్మ సైతం టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. రోహిత్ నిర్ణయం వెలువడిన వెంటనే కోహ్లీ కూడా తప్పుకుంటాడని వార్తలు వచ్చాయి. అదే సమయంలో టెస్ట్ క్రికెట్‌లో కొసాగాలని కోహ్లీని బీసీసీఐ(BCCI) బుజ్జిగిస్తుందని కూడా ప్రచారం జరిగింది. కానీ కోహ్లీ మాత్రం ఎవరి మాట వినకుండా ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు.టెస్ట్ క్రికెట్ తనను ఎంతో పరీక్షించిందని, ఎన్నో గుణపాఠాలు నేర్పిందని, ఎంతో ఇచ్చిందని,గుండె నిండా సంతోషంతో ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నానని కోహ్లీ తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ నిర్ణయంతో షాక్‌కు గురైన అభిమానులు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీని అవమానపరిచి ఆట నుంచి తప్పుకునేలా చేశారని, ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వల్లే ఇదంతా జరిగిందని మండిపడ్డారు.

టీమిండియా
ఈ సమయంలోనే కోహ్లీ రిటైర్మెంట్‌పై గౌతమ్ గంభీర్(Gautam Gambhir) సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. అతని ఆటను కొనియాడుతూ ట్వీట్ చేశాడు. మైదానంలో కోహ్లీని ఎంతో మిస్సవుతానని పేర్కొన్నాడు. ‘సింహం లాంటి ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తివి నీవు నిన్ను నీ చిరునవ్వును ఎంతో మిస్సవుతాను’అని గంభీర్ ట్వీట్ చేశాడు.విరాట్ కోహ్లీ తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో 123 టెస్ట్‌లు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. సుదీర్ఘ ఫార్మాట్‌లో కోహ్లీ సక్సెస్‌ఫుల్ టీమిండియా కెప్టెన్. అతని సారథ్యంలో 68 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 40 మ్యాచ్‌లు గెలిచింది. 2016-19 మధ్య కాలంలో కోహ్లీ పరుగుల మోత మోగించాడు. ఈ మూడేళ్లలో అతను 43 టెస్ట్‌ల్లో 66.79 సగటుతో 4,208 రన్స్ చేశాడు. ఆడిన 69 ఇన్నింగ్స్‌లో 16 శతకాలతో పాటు 10 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ కాలంలోనే కోహ్లీ వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగాడు.
Read Also : IPL 2025: కోహ్లీ, రోహిత్‌ల పై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు!