టెస్ట్ జట్టు కోచ్‌గా గంభీర్ (Gambhir) ను పక్కనపెట్టి ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వాటన్నింటినీ బీసీసీఐ కొట్టపారేసింది. ఈ విషయంపై అధికారికంగా క్లారిటీ ఇచ్చింది.ఈ పుకార్లపై బీసీసీఐ సంయుక్త కార్యదర్శి దేవజిత్ సైకియా ఓ జాతీయ ఛానల్‌తో మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు. “గౌతమ్ గంభీర్ (Gambhir) ను మారుస్తారనే వార్తలు పూర్తిగా అవాస్తవం.
Read Also: Navjot Singh: కోహ్లీ తిరిగి టెస్టు క్రికెట్ ఆడాలి

బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
ఇప్పటివరకు అలాంటి చర్చలే జరగలేదు. గంభీర్‌తో మా కాంట్రాక్ట్ 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఉంది. కోచింగ్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు ఉండవు. ఆయనపై మాకు పూర్తి నమ్మకముంది. ఇలాంటి కల్పిత వార్తలు ఎలా పుడతాయో అర్థం కావడం లేదు” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు తమకు తోచిన విధంగా ఆలోచనలు చేస్తుంటారని, కానీ బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సైకియా పేర్కొన్నారు.
బీసీసీఐ (BCCI) తాజా ప్రకటనతో గంభీర్ హెడ్ కోచ్ పదవిపై నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్లయింది.ఈ ఏడాది సౌతాఫ్రికా(0-2), న్యూజిలాండ్(0-3)తో టెస్టు సిరీస్‌లు వైట్‌వాష్ కావడంతో గంభీర్ కోచింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాదాపు 12ఏళ్ల తర్వాత IND స్వదేశంలో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. దీంతో గంభీర్ ప్రయోగాలే ఓటమికి కారణమని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: