हिन्दी | Epaper

ఇంగ్లాండ్ 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభం

Divya Vani M
ఇంగ్లాండ్ 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభం

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న భారత్ ఇప్పుడు వన్డే సిరీస్‌పై దృష్టి పెట్టింది. రేపటి నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది గురువారం నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ) స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా స్పీడ్‌స్టార్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా లేకపోవడంతో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ బౌలింగ్ దళాన్ని నడిపించనున్నాడు.అయితే ఈ మ్యాచ్‌కు ముందు షమీకి ఒక విశేషమైన అవకాశం ఉన్నది ఇప్పటివరకు 101 వన్డేల్లో 195 వికెట్లు సాధించిన షమీ నాగ్‌పూర్‌లో కనీసం ఐదు వికెట్లు తీస్తే, ప్రపంచ రికార్డు సాధించవచ్చు. అలా చేస్తే ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌తో ప్రపంచ రికార్డును సమం చేస్తాడు.

ఇంగ్లాండ్ 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభం
ఇంగ్లాండ్ 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభం

స్టార్క్ 102 వన్డే మ్యాచ్‌లలో తన 200వ వికెట్‌ను సాధించాడు. రేపు షమీ ఐదు వికెట్లు తీస్తే అదే రికార్డు సృష్టించవచ్చు.భారత్ తరపున వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు సాధించిన బౌలర్‌గా అజిత్ అగార్కర్ రికార్డును కలిగి ఉన్నారు. 2004 డిసెంబర్ 26న ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన 133వ వన్డేలో అగార్కర్ తన 200వ వికెట్‌ను సాధించాడు. ఇంతవరకు వన్డేల్లో భారత్ తరఫున 200కి పైగా వికెట్లు సాధించిన ఏడుగురు బౌలర్లు మాత్రమే ఉన్నారు. రాబోయే మ్యాచ్‌ల్లో షమీ ఐదు వికెట్లు తీస్తే ఈ జాబితాలో చేరే ఎనిమితి బౌలర్ అవుతాడు. అయితే భారత వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉంది. కుంబ్లే 269 వన్డేల్లో 334 వికెట్లు తీశాడు ఇది ప్రస్తుతం కూడా ఒక అద్భుతమైన మైలురాయి. షమీ ప్రస్తుతం కెరీర్‌లో అత్యంత కీలక మలుపు చేరుకున్న వేళ ఆయన రికార్డును సాధిస్తే భారత క్రికెట్ చరిత్రలో మరో ఘనత జోడించబడుతుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్రిస్ గేల్ రికార్డుపై కన్నేసిన వైభవ్

క్రిస్ గేల్ రికార్డుపై కన్నేసిన వైభవ్

కావ్య మారన్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్

కావ్య మారన్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు గ్రీన్ సిగ్నల్!

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు గ్రీన్ సిగ్నల్!

అంతర్జాతీయ క్రికెట్‌కు సర్ఫరాజ్ అహ్మద్ వీడ్కోలు

అంతర్జాతీయ క్రికెట్‌కు సర్ఫరాజ్ అహ్మద్ వీడ్కోలు

గిల్, మంధానలను వరించిన ప్రతిష్ఠాత్మక పురస్కారాలు

గిల్, మంధానలను వరించిన ప్రతిష్ఠాత్మక పురస్కారాలు

‘ఇది ఆరంభం మాత్రమే’: రోహిత్

‘ఇది ఆరంభం మాత్రమే’: రోహిత్

మా మధ్య కమ్యూనికేషన్ చాలా సింపుల్‌గా ఉంటుంది: సంజు

మా మధ్య కమ్యూనికేషన్ చాలా సింపుల్‌గా ఉంటుంది: సంజు

ధోని రిటైర్మెంట్‌ పై ఉతప్ప ఏమంటున్నారు?

ధోని రిటైర్మెంట్‌ పై ఉతప్ప ఏమంటున్నారు?

ఫైనల్లో భారత్ తడబాటు: ఇంగ్లండ్ సొంతమైన టైటిల్

ఫైనల్లో భారత్ తడబాటు: ఇంగ్లండ్ సొంతమైన టైటిల్

పాక్ విండీస్ సిరీస్ ఎఫెక్ట్.. ది హండ్రెడ్ టోర్నీకి అబ్రార్ దూరం?

పాక్ విండీస్ సిరీస్ ఎఫెక్ట్.. ది హండ్రెడ్ టోర్నీకి అబ్రార్ దూరం?

సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లో లోపాలు.. ఆ ముగ్గురు అవుటైతే అంతేనా?

సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లో లోపాలు.. ఆ ముగ్గురు అవుటైతే అంతేనా?

ఏ జట్టూ ఐసీసీ కంటే పెద్దది కాదు: జై షా

ఏ జట్టూ ఐసీసీ కంటే పెద్దది కాదు: జై షా

📢 For Advertisement Booking: 98481 12870