हिन्दी | Epaper
గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Latest News:  Dinesh Karthik: రోహిత్ శర్మ‌పై మాజీ క్రికెటర్ ప్రశంసలు

Aanusha
Latest News:  Dinesh Karthik: రోహిత్ శర్మ‌పై మాజీ క్రికెటర్ ప్రశంసలు

టీమిండియా క్రికెట్‌లో విప్లవాత్మక మార్పులు జరుగుతున్న నేపథ్యంలో, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను వన్డే సారథ్య బాధ్యతల నుండి తప్పించడం భారత క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పెద్ద మ్యాచ్‌లు ఎలా గెలవాలో టీమిండియాకు రోహిత్ శర్మ (Rohit Sharma) నేర్పించాడని కొనియాడాడు. ‘రోహిత్ శర్మకు థ్యాంక్స్. మీరు వ్యూహాత్మకంగా చతురత కలిగిన అద్భుతమైన కెప్టెన్. ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నారు. అందరిని కలుపుకుపోయారు.

BCCI: దేశవాళీ క్రికెట్ లో విరాట్, రోహిత్‌ ఆడాల్సిందే.. బోర్డు స్పష్టం

ఆటగాళ్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా సౌకర్యంగా ఉండేలా చేశారు. పెద్ద టోర్నీల్లో అతి ముఖ్యమైన మ్యాచ్‌ల్లో గెలవడానికి ఏమి అవసరమో ప్రస్తుత జట్టుకు నేర్పించావు. కొన్నిసార్లు మేము వెనక్కి తగ్గేవాళ్లం. కానీ నువ్వు మాత్రం మమ్మల్ని ప్రోత్సహించేవాడివి. మరింత ముందుకు సాగి, ప్రత్యర్థిపై ఒత్తిడి తేవాలని, టైటిల్ వదిలేయకూడదని చెప్పేవాడివి.పెద్ద మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా మరింత బాధ్యత తీసుకొని బ్యాటింగ్ చేశావు.

పెద్ద మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా మరింత బాధ్యత

మనం ఆడిన చివరి 3 పెద్ద టోర్నీల్లో భారత ఒక మ్యాచ్ మాత్రమే ఓడింది. 2024 టీ20 ప్రపంచకప్ (2024 T20 World Cup), ఛాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా ముందుకు సాగాం. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మాత్రమే ఓడాం. అదే జోరు ఇప్పుడూ కూడా చూస్తున్నాం. ఇటీవల యువ జట్టు ఆసియా కప్ గెలిచింది. ఆ స్ఫూర్తి మీరు అందించినదే.

Dinesh Karthik
Dinesh Karthik

కెప్టెన్‌గా మీరు బాధ్యతలు చేపట్టినప్పటి కంటే జట్టును మెరుగైన స్థానంలో ఉంచారు. అది గొప్ప నాయకుడి లక్షణం.’అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.అక్టోబర్ 19 నుంచి టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది. మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌ల కోసం భారత్ అక్కడికి వెళ్లనుంది. నవంబర్ 8 వరకు కొనసాగే ఈ పర్యటనలో ముందుగా వన్డేలు.. ఆ తర్వాత టీ20 సిరీస్‌ జరగనుంది.

వన్డే ప్రపంచకప్ 2027 నేపథ్యంలో

ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించిన జట్లను భారత సెలెక్టర్లు ప్రకటించారు.టీమిండియా వన్డే సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా, శ్రేయస్ అయ్యర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. వన్డే ప్రపంచకప్ 2027  (2027 World Cup) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కెప్టెన్సీ కోల్పోయినా ఆటగాడిగా రోహిత్ శర్మ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

విరాట్ కోహ్లీ కూడా రీఎంట్రీ ఇచ్చాడు. రవీంద్ర జడేజాపై వేటు వేసిన సెలెక్టర్లు నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించారు. సిరాజ్ వన్డే టీమ్‌లోకి రీఎంట్రీ ఇవ్వగా.. బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. ఆసియా కప్ 2025లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన తిలక్ వర్మ.. టీ20లకే పరిమితమయ్యాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870