हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest News: MS Dhoni: ధోనీ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు : సాయి కిషోర్

Anusha
Latest News: MS Dhoni: ధోనీ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు : సాయి కిషోర్

మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ని అందరు “క్యాప్టెన్ కూల్” అని పిలుస్తారు. ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, మైదానంలో ధోనిలోని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అత్యంత కఠిన పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా, ఒత్తిడిని పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవడం, ఆటగాళ్లను మోటివేట్ చేయడం, పరిస్థితులను చక్కగా అంచనా వేసి సరైన నిర్ణయాలను తీసుకోవడం – ఇవన్నీ ధోనీని ప్రత్యేకంగా నిలబెట్టాయి.

Dhruv Jurel :ధ్రువ్ జురెల్ & జడేజా జోరు – భారత్ వెస్టిండీస్‌పై భారీ ఆధిక్యం

టీమ్ ఇండియా (Team India) కు అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్‌లలో ఒకరైన ధోనీ, ఐపీఎల్‌లో కూడా చెన్నై సూపర్ కింగ్స్‎ను 5 సార్లు ఛాంపియన్‌షిప్ అందించాడు. ధోనీ కోట్ల మంది యువకులకు ఆదర్శం, అయితే అతను సోషల్ మీడియాకు మాత్రం చాలా దూరంగా ఉంటాడు.

ధోనీతో పాటు సీఎస్కే జట్టు (CSK team) లో భాగమైన భారత క్రికెటర్ సాయి కిషోర్, ధోనీ ఫోన్ అస్సలు ఎత్తడని, అది ఎలా తనపై ప్రభావం చూపిందో తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఎంఎస్ ధోనీ నాయకత్వంలో ఐపీఎల్ ఆడిన భారత క్రికెటర్లు లేదా విదేశీయులు అయినా సరే,

ఆటగాళ్లతో బాగా కనెక్ట్ అవుతాడు

అందరూ ధోనీ కెప్టెన్సీని, అతని ప్రవర్తనను పొగుడుతూనే ఉంటారు. అతను ఆటగాళ్లతో బాగా కనెక్ట్ అవుతాడు. వారి నుండి విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు. అయితే సాయి కిషోర్ మాత్రం ధోనీ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.సాయి కిషోర్ ఐపీఎల్ కెరీర్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో ప్రారంభమైంది.

అప్పుడు CSK అతన్ని 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. రెండు సీజన్‌లలో జట్టులో భాగమైనప్పటికీ, అతనికి ఆడే అవకాశం రాలేదు. 2022లో, గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) అతన్ని 3 కోట్ల రూపాయలకు కొని తమ జట్టులో చేర్చుకుంది. CSK లో ఉన్నప్పుడు ధోనీ నుండి తాను ఏమి నేర్చుకున్నాడో సాయి కిషోర్ వివరించారు.

MS Dhoni
MS Dhoni

ఫోన్‌ను హోటల్ రూమ్‌లోనే వదిలిపెట్టి వెళ్ళేవాడు

ప్రోవోక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి కిషోర్ (Sai Kishore) మాట్లాడుతూ.. “నేను ఎంఎస్ ధోనీ నుంచి చాలా నేర్చుకున్నాను. అతను తన ఫోన్ అస్సలు ఎత్తేవాడు కాదు. మ్యాచ్‌లకు వెళ్ళేటప్పుడు తన ఫోన్‌ను హోటల్ రూమ్‌లోనే వదిలిపెట్టి వెళ్ళేవాడు. అతను సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండేవాడని చెప్పారు.“సోషల్ మీడియా (Social media) కు కనెక్ట్ అయి ఉండటం నిజంగా అవసరమా అని నేను నన్ను నేనే ప్రశ్నించుకునేవాడిని.

అందుకే అతన్ని చూసి నాకు స్ఫూర్తి కలిగింది” అని సాయి కిషోర్ అన్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి క్రికెటర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఇది డబ్బు సంపాదించడానికి, అభిమానుల సంఖ్యను పెంచుకోవడానికి ఒక మార్గం కూడా. కానీ ఎంఎస్ ధోనీ మాత్రం సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్‌గా ఉంటాడు.

పండుగలైనా, ఎవరి పుట్టినరోజైనా లేదా ఏదైనా పెద్ద ఈవెంట్ అయినా, ధోనీ చాలా అరుదుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు.ధోనీ ఈ ప్రశాంతమైన లైఫ్ స్టైల్, ఫోన్‌కు, సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వంటి అలవాట్లే అతను మైదానంలో కెప్టెన్ కూల్‎గా ఉండటానికి ఒక ప్రధాన కారణమని సాయి కిషోర్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. ఇది యువ క్రికెటర్లకు, సాధారణ ప్రజలకు కూడా ఒక మంచి గుణపాఠం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870