ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు ఐదు ట్రోఫీలు అందించిన దిగ్గజ సారథి మహేంద్రసింగ్ ధోనీ మరోసారి సీఎస్‌కే జట్టు నాయకుడిగా వ్యవహరించనున్నాడు. సీఎస్‌కే రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేతి గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగడంతో జట్టు మేనేజ్‌మెంట్ మహేంద్రుడికే ఆ పగ్గాలు అప్పజెప్పింది.ఈ సీజన్‌లో చెన్నై ఐదు మ్యాచ్‌లు ఆడగా కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. మిగతా నాలుగు మ్యాచుల్లో ఘోర పరాభావం ఎదుర్కొంది. ఐదు సార్లు టైటిల్ విన్నర్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో మాత్రం టేబుల్ చివరికి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది.
రుత్‌రాజ్ సారథ్యం
ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లు అన్ని రుత్‌రాజ్ గైక్వాడ్ సారథ్యంలో జరిగాయి. అయితే గత మ్యాచ్‌లో మోచేతి గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రుత్‌రాజ్ గైక్వాడ్ పలు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇక గాయం తగ్గే వరకు అతను వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో ఇక సీఎస్‌కే పగ్గాలు మళ్లీ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చేతికి వచ్చాయి. దీంతో సీఎస్‌కే అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది. ధోని వచ్చాడుగా ఇక సీఎస్‌కే విజయాలకు బాటలు పడినట్టే అనే భావనకు వచ్చారు.కొత్త సారథి ధోని ముందు ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి వాటన్నింటిన ఎదుర్కొని ముందుకు నడవాల్సి ఉంది.

తీవ్ర ఉత్కంఠ
ఈ సీజన్ మొదటి నుంచే చెన్నై ఆటగాళ్లు అంతంతమాత్రంగానే ఆడుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో అంతగా రాణించలేకపోతున్నారు. 180 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి నానా అవస్థలు పడుతున్నారు. పవర్ ప్లే లోనే వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడుతున్నారు. ఇటు మిడిలార్డర్ విఫలం కావడం, వేగంగా పరుగులు సాధించలేక పోవడం, అటు బౌలర్ల వైఫల్యం చెన్నైకు పెను శాపంగా మారింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ రుత్‌రాజ్ మినహా ఎవరూ అంతగా రాణించట్లేదు. ఇప్పుడు అతను కూడా గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో చెన్నై పరిస్థితి మరింత దీనంగా మారిందనే చెప్పవచ్చు. దీంతో చెన్నై బ్యాటింగ్ లైనప్‌పై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రుత్‌రాజ్ స్థానాన్ని ఎవరు బర్తీ చేస్తారనే సందేహంలో ఫ్యాన్స్ పడిపోయారు. ఇక బ్యాటింగ్ లైనప్ మార్పులతో పాటు బౌలింగ్‌లోనూ మార్పులు చేయాల్సి ఉంది. ఇక మ్యాచ్ పగ్గాలు ధోనికి వచ్చాయి కాబట్టి మ్యాచ్ విజయవాలపై అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఇలాంటి పరిస్థితులు కెప్టెన్ కూల్‌కు పెద్ద విషమమే కాదని..ఇకపై ఆడే మ్యాచుల్లో ఖచ్చితంగా సీఎస్‌కే నెగ్గుతుందని భావిస్తున్నారు.
Read Also: IPL 2025: యశస్వి జైశ్వాల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ